సోషల్ మీడియాలో "సుఖీభవ" అనే పాట తో ఊపేసిన నల్లగుట్ట డాన్సర్ శరత్ కు తీవ్ర గాయాలు అయినట్లు కనిపిస్తోంది. నల్లగుట్ట డ్యాన్సర్ శరత్ టిక్ టాక్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. టిక్ టాక్ లో పుట్టిన రోజు విషెస్ చెప్తూ శరత్ ఫేమస్ అయ్యారు. అయితే టిక్ టాక్ బ్యాన్ తర్వాత శరత్ వీడియోలు పెద్దగా కనిపించలేదు. అయితే ఇటీవల ఇన్ స్టాగ్రామ్ రీల్స్ లో అయ్యయ్యో వద్దమ్మా అంటూ ప్రసారమయ్యే టీ పౌడర్ కు సంబంధించిన యాడ్ ను శరత్ పాట రూపంలో పాడారు.

భరత్ జరుగుతున్న సందర్భంలో ఓ వ్యక్తి పాట పాడాలని కోరగా శరత్ అయ్యయ్యో అంటూ మొదలు పెట్టాడు. ఇక శరత్ పాడిన పాటకు విశేష స్పందన లభించింది. సోషల్ మీడియాలో శరత్ కు ఎంతోమంది అభిమానులు అయ్యారు. అయితే శరత్ గాయాలతో కనిపిస్తున్న ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కాగా కొందరు వ్యక్తులు శరత్ పై దాడి చేశారని కామెంట్లు కనిపిస్తున్నాయి. అయితే శరత్ ను ఎవరైనా కొట్టారా లేదంటే ఏదైనా యాక్సిడెంట్ లో ఇలా గాయపడ్డాడా అన్నది తెలియాలంటే శరత్ నోరు విప్పాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: