కరోనాతో జనాలు యుద్ధం చేస్తూనే ఉన్నారు.అమెరికా లో  కోవిడ్ కారణంగా అధిక సంఖ్యలో మరణాలు సంభవించాయి కూడా. ఇదిలా  ఉంటె ప్రస్తుతం అక్కడదొరికే ఉల్లి పాయ అమెరికా ప్రజల్లో గుబులు రేపుతోంది. దీనికి కారణం దానిలో పెరిగే సాల్మొనెల్లా బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా కారణంగా సాల్మనెల్లోసిస్ అనే  వ్యాధి ప్రజలను పట్టి పీడిస్తోంది. గత కొద్దిరోజులుగా భారీగా కేసులు నమోదు అయ్యాయి. ఈ వ్యాధికి ప్రధాన కారణం సాల్మొనెల్లా బ్యాక్టీరియా అని అమెరికా కి సంబందించిన సెంటర్స్ ఫర్ డెసీస్ అండ్ ప్రవెన్షన్ (సీడీసీ) నిర్దారణ చేసింది .




అక్టోబరు 18 నుండి ఇప్పటివరకు 652 కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దాదాపు 125 ఈ వ్యాధికారణంగా హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకున్నారు. గత మే నెలలోనే ఈ వ్యాదిగురించి తెలిసిన.. ఏ ఆహారం ఇందుకు కారణమో తెలియరాలేదు. అయితే మెక్సికో నుంచి ప్రోసోర్స్ అనే వ్యాపార సంస్థ హోటళ్లకు , రెస్టారెంట్లకు , కిరానా దుకాణాలకు ఉల్లిపాయల్ని సరఫరా చేసిందని తెలుసుకున్నారు. ఈ ఉల్లిపాయలోని బ్యాక్టీరియా కారణంగానే ఈ వ్యాధి సంక్రమించింది భావిస్తున్నారు. అయితే ఇప్పటికే సోదాలు జరిపి వాటిని తక్షణం పారవేయవలసిందిగా సీడీసీ కోరింది . జులై 1 నుంచి ఆగస్టు 27 వరకు దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలను తక్షణం పారవేయవలసింది గా సీడీసీ కోరింది.


మరింత సమాచారం తెలుసుకోండి: