నిన్న మొన్నటిదాకా 30 రూ. నుండి 40 రూ. వరకు ఉన్న మేకపాలు ధర ఏకంగా 400 రూ. లకు పెరిగింది. మేక పాలేంటీ అంత రేటు పెరగడం ఏంటని అనుకుంటున్నారా. అవునండి ప్రస్తుతం మేక పాలు లీటరు 400 రూ. లనుండి 500 రూ. వరకు పలుకుతోంది. మధ్యప్రదేశ్ లో ఛత్తర్ పూర్ లో మేకపాలు 400  రూ. పెట్టినా దొరకని పరిస్థితి నెలకొంది.  ఇందుకు కారణం ఆ రాష్ట్రం లో పెరుగుతున్న డెంగ్యూ కేసుల సంఖ్య నే. గత కొన్ని రోజులుగా మధ్యప్రదేశ్ లో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయ్. 


IHG
 ఐతే డెంగ్యూ వల్ల  రక్తకణాల సంఖ్యా తగ్గిపోతూ ఉండడంతో . ఛత్తర్ పూర్  ప్రజలు మేకపాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. మేకపాలు తాగడం వల్ల ప్లేట్లెట్స్ గణనీయంగా పెరగడం వారు గమనించారు. అయితే అక్కడి ప్రజలు ఈ పాలను ఔషధం గా భావించడం విశేషం . వైద్యులు మాత్రం ఈ విషయమై వివరణ ఇచ్చారు. మేకపాలు తాగడం వల్ల డెంగ్యూ జ్వరం తగ్గదని ఆస్కారం వుంది కానీ ఇదే డెంగ్యూ జ్వరాన్ని తగ్గించే పూర్తి ఔషధం మాత్రం కాదు అని  చెప్పారు. ఇది కేవలం అపోహామాత్రమే అని వారు కొట్టిపడేసారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: