బద్వేల్ ఎన్నికల్లో  కిడ్నాప్ కలకలం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కలసపాడు మండల బీజేపీ మండల అధ్యక్షులు రామక్రిష్ణారెడ్డి కిడ్నాప్ కావడం అక్కడ సంచలనంగా మారింది. మంత్రి పెద్దిరెడ్డి అనుచరులే కిడ్నాప్ చేశారని బీజేపీ రాష్ట్ర అద్యక్షులు సొమువీర్రాజు ఆరోపణలు చేసారు. ఎస్పీ అన్బురాజన్ కు ఫిర్యాదు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు... దీని మీద ఎస్పీ చర్యలు తీసుకోవాలని కోరారు.

వైసీపీ నేతల బెదిరింపులు, కిడ్నాప్ లకు పాల్పడం సరికాదు అన్నారు ఆయన. ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు బెదిరేది లేదు అని స్పష్టం చేసారు. రామక్రిష్ణారెడ్డి ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసారు. బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారంలో బిజెపి నాయకులు పలువురు పాల్గొని విజయవంతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక రేపటి తో ప్రచారం ముగుస్తున్న నేపధ్యంలో బిజెపి హీట్ పెంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp