జనసేన అధినేత పవన్ కళ్యాణ్  విశాఖ పర్యటన ఖరారు అయింది.  ఆయ‌న‌ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను తాజాగా ప్రకటించింది ఆ పార్టీ. ఉక్కు పరిరక్షణ పోరాట ఉద్యమానికి సంఘీభావాన్ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తెలుప‌నున్నారు. అక్టోబ‌ర్ 31న  మధ్యాహ్నం ఉక్కు పరిరక్షణ సభలో పాల్గొంటారని వెల్లడించింది.  విశాఖ స్టీల్‌ ప్లాంట్  ప్ర‌యివేటీక‌రణపై కేంద్రం అడుగులు వేస్తుండగా.. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని సాధించుకున్న స్టీల్‌ ప్లాంట్‌ను వదులుకోవడానికి సిద్ధంగాలేని కార్మిక, ప్రజాసంఘాలు ఆందోళన చేస్తూ వస్తున్నాయి. కార్మికుల‌కు వివిధ రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతుండగా.. ఇప్పుడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉక్కు పరిరక్షణ సభలో పాల్గొననున్నారు.

ఇది ఇలా ఉండ‌గా ఉపాధి కోసం గిరిజనులు గంజాయ్ ఉచ్చులో చిక్కుకుని నేరస్తులుగా మారుతున్నారని జనసేన అధికార ప్రతినిధి సుందరపు విజయ్ కుమార్ మండిపడ్డారు. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు సక్రమంగా ఖర్చుచేసి  ఉండుంటే గిరిజన యువత దారి తప్పే పరిస్ధితి  ఉండేది కాద‌ని పేర్కొన్నారు.  ఏవోబీని జల్లెడపట్టే వ్యవస్ధ పోలీసుశాఖకు ఉన్నప్పుడు గంజాయి అక్రమ రవాణా  ఆగడం లేదు ఎందుకు అని ప్రశ్నించారు. కొందరు అధికారపార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల మీదుగా గంజాయి తరలిపోవడం  ప్ర‌భుత్వానికి కంపించడం లేదా అని నిలదీశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: