తాజాగా 70 ఏండ్ల ఓ వృద్ధుడు అనారోగ్యానికి గురవ్వడంతో వైద్యం కోసం డోలీలో మోసుకుంటూ బంధువులు తీసుకెళ్లారు. ధారపర్తి పంచాయతీ పరిధిలోని చిట్టెంపాడు గ్రామానికి చెందిన కేరింగి ధర్మయ్య అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకు వెళ్లడానికి రోడ్డు మార్గం లేకపోవడంతో డోలీలో దాదాపు 10కిలోమీటర్ల వరకు తీసుకెళ్లి కొండ దించారు. ఆతరువాత ఆటోలో శృంగవరపు కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వృద్ధుడిని. శృంగవరపుకోట మండలంలోని ప్రజలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తున్నది. దాదాపు 10 కిలోమేరకు మేర వరకు చిన్న, పెద్ద, తేడా లేకుండా ఎవరినైనా డోలీలో మోసుకొని వెళ్లి కొండ దించాల్సిన పరిస్థితి దాపురించినది. ఎన్ని సార్లు తమ గోడును ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తమ సమస్యను మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదని అక్కడి గ్రామస్తులు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి