ప్రజాప్రతినిధుల కేసులకు సంబంధించి ఇప్పుడు న్యాయస్థానాలు చాలా సీరియస్ గా ఉన్నాయి. సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు అన్ని న్యాయస్థానాల్లో ఇప్పుడు దీనికి సంబంధించి విచారణ వేగవంతం అయింది. ఇక ప్రజాప్రతినిధులపై దాఖలైన క్రిమినల్‌ కేసుల సత్వర విచారణపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు విచారణ చేసే అవకాశం ఉంది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల అమలులో లోపాలు కనిపిస్తున్నాయని, విచారణ వేగవంతం కాకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని సుప్రీంకోర్టులో పలువురు న్యాయవాదులు పిటీషన్ వేసారు.

ఏడాదిలో కేసు విచారణ పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు కావడం లేదని పిటిషనర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని వివరాలతో సిద్దంగా ఉండాలని గత వారం విచారణ సందర్భంగా... సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను సిజెఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆదేశించారు. ఈ వ్యవహారంపై ఇవాళ మరోసారి సిజెఐ ధర్మాసం విచారణ చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: