ఏపీలో అప్పుడు ఎన్నికల కాక మొదలైంది. పొత్తుల గురించి విమర్శలు మొదలయ్యాయి. సింహం సింగిల్‌ గా వస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే.. దేశంలో అంటరాని పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీయేనంటున్నారు టీడీపీపొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. చంద్రబాబును ఉద్దేశించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. తాము ఎవరితో కలిస్తే జగన్ కి వచ్చిన నష్టమేంటని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిలదీశారు. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎవరితో కలిసారో జగన్ మర్చిపోయారా అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. జగన్ చెప్పే అబద్ధాలు ప్రజలు విశ్వసించరని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటున్నారు. రాష్ట్ర ప్రజలకు దుష్ట చతుష్టయం ఎవరో అందరికీ తెలుసని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రోడ్లు పరిస్థితి చూసి ప్రజలు భయపడుతున్నారని.. వైసీపీ పాలన చూసి భయపడటానికి మూడేళ్లలో ఏం ఒరగపెట్టారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: