రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ యుద్ధంలో రష్యాదే పైచేయి.. కానీ.. ఉక్రెయిన్‌కు నాటో దేశాలు సహకరిస్తున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలో రష్యాతో భీకర యుద్ధం జరుగుతోంది. ఇలాంటి సమయంలో జెలెన్‌ స్కీ బలగాలకు మరో నూతన అస్త్రం చేరింది. ఇప్పటికే ఉక్రెయిన్‌కు భారీగా ఆయుధాలు ఇచ్చిన అమెరికా ఇప్పుడు ఏకంగా బ్రహ్మాస్త్రం అందించింది.


ఒక్కసారిగా పెను విధ్వంసం సృష్టించగల సూసైడ్‌ డ్రోన్‌లను అమెరికా ఉక్రెయిన్‌కు అందించింది. తూర్పు ప్రాంతంలో రష్యా బలగాలు, తిరుగుబాటుదారులపై ఒక్కసారిగా దాడి చేసేందుకు ఈ డ్రోన్‌లను ఉక్రెయిన్‌ ఉపయోగిస్తోంది. ఉక్రెయిన్‌ తూర్పు ప్రాంతంలో పట్టు కోసం జరుగుతున్న  రష్యా-ఉక్రెయిన్‌ భీకర పోరాటంలో ఇప్పుడు ఈ ఆయుధాలు ఉక్రెయిన్ చేతిలో బ్రహ్మాస్త్రాలుగా మారుతున్నాయి. జెలెన్‌ స్కీ సేనలకు ఈ అమెరికా కొత్త అస్త్రం వరంగా మారింది. అమెరికా తయారు చేసిన డ్రోన్‌తో సహా కొత్త వైమానిక ఆయుధాలను ఉక్రేనియన్ సైన్యం డొనేట్స్క్ యుద్దభూమిలోకి తీసుకువచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: