ఉక్రెయిన్‌ పై యుద్ధంతో చెలరేగిపోతున్న రష్యాకు ఇప్పుడు మరో దేశం నుంచి అనూహ్యంగా షాక్ తగిలింది. రష్యా.. తాను ఆక్రమించుకున్న ఉక్రెయిన్‌ భూభాగం నుంచి ధాన్యం తరలిస్తుండగా.. టర్కీ దేశపు కస్టమ్స్ అధికారులు రష్యా నౌక ఝిబెక్‌ ఝోలెను అదుపులోకి తీసుకొన్నారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ అధికారి ఒకరు తెలిపారు.


ఆ నౌక పోర్టు సమీపంలో ఉందని.. దానిని టర్కీ కస్టమ్స్‌ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారని సదరు ఉక్రెయిన్ అధికారి వెల్లడించారు. ఉక్రెయిన్‌ పోర్టు బెర్డియాన్స్క్‌ నుంచి వచ్చేటప్పుడు రష్యా నౌక కదలికలను తాము పూర్తిగా కనిపెట్టినట్లు సదరు అధికారి తెలిపారు. ఈ నౌకలో 7,000 టన్నుల ధాన్యాలను మిత్రదేశాలకు తరలిస్తున్నారని అనుమానిస్తున్నారు. అయితే ఆ నౌకకు రష్యా బ్లాక్‌ సీ దళంలోని నౌకలు రక్షణ కల్పించాల్సి ఉంది. ఈ నౌక టర్కీ రేవు నుంచి బయల్దేరి రష్యాలోని ఓ పోర్టులో అన్‌లోడ్‌ చేసిన తర్వాత ఉక్రెయిన్‌కు బయల్దేరింది. అప్పటి నుంచి ట్రాకింగ్ తప్పింది. దీంతో టర్కీ ఈ నౌకను అదుపులోకి తీసుకున్నట్టు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: