కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్‌ బీజేపీలో చేరారు. ఇటీవల తెలంగాణ బీజేపీలో చేరికలు పెరిగాయి. ఇటీవలే కోమటి రెడ్డి వెంకటరెడ్డి పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాసోజు శ్రవణ్ కూడా చేరారు. తెలంగాణ బిజెపి వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో దాసోజు శ్రవణ్ బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బిజెపి ఎంపీ లక్ష్మణ్, సీనియర్ నేత మురళీధర్ రావు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు.

తెలంగాణ లో అనేక సంవత్సరాలు ప్రజా పోరాటాలు చేసిన శ్రవణ్... మోడీ నాయకత్వం బిజెపి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం, భద్రత చర్యల పట్ల ఆకర్షితులై, టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపినే అని పార్టీలో చేరడం శుభపరిణామమని బిజెపి జాతీయ నేత మురళీధర్ రావు అన్నారు. బీజేపీలో చేరిన శ్రవణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. శ్రవణ్ చేరికతో టిఆర్ఎస్ పై పోరాటంలో బిజెపి మరింత బలపడుతుందని భావిస్తున్నానన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp