ఉద్యోగాల కోసం మన దేశంలో ఎందరో నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. అయితే.. అవసరమైనన్ని ఉద్యోగాలు కల్పించడంలో మనం విఫలం అవుతున్నాం. కానీ.. ఆ దేశంలో ఏకంగా 10 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయట. ఇంతకీ అదే దేశం అంటారా.. అదే కెనడా.
అవును.. కెనడా దేశంలో భారీగాఉద్యోగాలు అందుబాటులో ఉన్నట్లు కెనడా లేబర్‌ ఫోర్స్‌ సర్వే వివరాలు చెబుతున్నాయి.

2022 మే నెలతో పోలిస్తే మరో 3 లక్షల ఖాళీలు పెరిగాయట. ఇలా మొత్తం 10లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయట. కెనడాలోని  చాలా పరిశ్రమల్లో కార్మికుల కొరత తీవ్రంగా ఉందట. అంతే కాదు.. కెనడాలో ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న వారిలో చాలా మంది త్వరలోనే రిటైర్ కాబోతున్నారట. దీంతో ఇప్పుడు కెనడాలో కార్మికులకు డిమాండ్‌ పెరిగింది. మరి మేం కూడా ట్రై చేస్తాం అంటారా.. మరి మీ ఇష్టం..

మరింత సమాచారం తెలుసుకోండి:

job