ఒకప్పుడు.. రావాలి జగన్.. కావాలి జగన్.. అన్న వాళ్లే ఇప్పుడు పోవాలి జగన్.. పోవాలి జగన్.. అంటున్నారని బీజేపీ నేత సునీల్‌ డియోధర్ అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరహాలోనే ప్రస్తుతం వైయస్సార్ జగన్ ప్రభుత్వం కూడా కేంద్ర పథకాలను వారి స్టిక్కర్లతో వేసి కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దివాలా దశకు చేరుకుందన్న బీజేపీ నేత సునీల్‌ డియోధర్.. ప్రతిదానికి అప్పు అప్పు అంటూ జగన్ వెళ్తున్నారని విమర్శించారు.


ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నారని బీజేపీ నేత సునీల్‌ డియోధర్ విమర్శించారు.  ప్రధానమంత్రి మోడీ పుట్టినరోజు దగ్గర నుంచి బిజెపి దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని... ఎన్నికల్లో ఒక్క అవకాశం అంటూ వచ్చిన జగన్.. ఇప్పుడు అధికారం నుంచి పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ నేత సునీల్‌ డియోధర్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: