చంద్రబాబును రిమాండ్‌కు తరలించిన రోజు న్యాయస్థానంలో జరిగిన జాప్యం గురించి ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చాలా బాధపడిపోయారు. ఉదయం 6 గంటలకు ఏసీబీ న్యాయస్థానానికి చంద్రబాబును సీఐడీ అధికారులు తీసుకుపోయారని.. ఉదయం 6 నుంచి దశల వారీగా విచారణ చేసిన న్యాయాధికారి రాత్రి 7 గంటలకు రిమాండ్‌ విధిస్తూ తీర్పు ఇచ్చారని రాధాకృష్ణ గుర్తు చేసుకున్నారు. అయితే.. ముద్దాయి ఎవరైనా కావొచ్చని..కానీ ఈ పద్నాలుగు గంటలు వారి పరిస్థితి ఏమిటని రాధాకృష్ణ ప్రశ్నించారు.


ముద్దాయిలకు ఆహారం సరఫరా చేసే బాధ్యతను ఇటు సీఐడీ అధికారులుగానీ అటు న్యాయస్థానంగానీ తీసుకోలేదని రాధాకృష్ణ అన్నారు.  ఇతరత్రా ప్రకృతి అవసరాలకు వారు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. 73 సంవత్సరాల వయసులో చంద్రబాబును ఈ విధంగా బాధించడం న్యాయమా అని నిలదీశారు. ఈ విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఉండి ఉండకపోతే న్యాయ వ్యవస్థ ఇప్పటికైనా చొరవ తీసుకోవడం అవసరమంటున్నారు రాధాకృష్ణ.

మరింత సమాచారం తెలుసుకోండి: