చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు కేంద్ర మంత్రివర్గం ఆమోదించడాన్ని స్వాగతిస్తున్నామని బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్ అన్నారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆ తర్వాత 2019 తర్వాత కూడా చేయకుండా ఇప్పుడు హడావుడిగా రాబోయే సార్వత్రిక ఎన్నిల్లో లబ్ధిపొందేందుకు ఈ బిల్లు తీసుకొచ్చిందని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ ఆక్షేపించారు.

బీఎస్‌పీ అధినేత మాయావతి కోరుతున్నట్లు జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు 50 రిజర్వేషన్ కల్పించాలని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్ డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమోదం పొందిన నేపథ్యంలో ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఓబీసీ మహిళల శాతం ఎంత అన్నది చెప్పాలని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్ విజ్ఞప్తి చేశారు. లేకపోతే మళ్లీ ఆధిపత్య వర్గాల మహిళలే చట్టసభల్లోకి వస్తే పేదలకు ఆ అవకాశాలు రాకుండా పోతాయని... ఈ విషయంపై బీజేపీపై ఒత్తిడి తెచ్చేందుకు బీఎస్‌పీ పోరాటం చేస్తుందని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్ హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: