తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుపు రాజకీయంగా సంచలనంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ఇది ఓ చర్చనీయాంశం అయ్యింది. అయితే తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందని క్లియర్ గా  కనిపించిందన్న ఓ వైసీపీ మాజీ మంత్రి 50 సీట్లు పైనే వస్తాయని వేరేవారితో 50 లక్షలు పందెం కాశానని చెప్పడం కలకలం రేపింది. అయితే తన కుమారుడు బి ఆర్ ఎస్ వస్తుందని , కాంగ్రెస్ తరుపున పందెం వద్దని .. చెప్పడం తో పందెం విరమించుకున్నానని కూడా ఆ నేత చెప్పారు.

ఆ నేత ఎవరో కాదు.. బాలినేని శ్రీనివాస రెడ్డి. మీరంతా సహకరిస్తే నే మళ్ళీ పోటీ చేస్తానని తన ప్రజలతో చెప్పిన బాలినేని శ్రీనివాస రెడ్డి.. జగన్ అంటే మాకు అభిమానం ఉంది... ఆయనకు కూడా ఉండాలి కదా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. నా కొడుకు ప్రణీత్ రెడ్డికి జగన్ అంటే పిచ్చి ప్రేమ అన్న బాలినేని శ్రీనివాస రెడ్డి.. తెలంగాణ ఎన్నికల్లో బి అర్ ఎస్ వస్తే , ఆంధ్రలో తిరిగి వైకాపా వస్తుందని తెలంగాణ లో తిరిగాడని గుర్తు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: