ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బీజేపీ నేత, డాక్టర్ ఎం.చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ కారద్యర్శి, భాజపా నేత మర్రి శశిధర్‌రెడ్డి లేఖ రాశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంగణం చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్న దివంగత డాక్టర్ మర్రి చెన్నారెడ్డి కాంస్య విగ్రహం ఏర్పాటు అంశం సీఎం పరిశీలించాలని అభ్యర్థించారు. స్వర్గీయ డాక్టర్ చెన్నారెడ్డి.. ఐదు దశాబ్దాలకు పైగా ప్రజాజీవితంలో ఉన్నారని.. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాకుండా ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్ గవర్నర్‌గా కూడా పనిచేశారని లేఖలో గుర్తు చేశారు.


1996లో ఆయన మరణించే సమయానికి తమిళనాడు గవర్నర్‌గా ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత ఆ సంస్థకు మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టినందుకు అప్పటి సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశామని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా ఈ సంస్థకు ఛైర్మన్‌గా కూడా ఉన్న దృష్ట్యా.. బలోపేతం చేయడంతోపాటు ఐఏఎస్‌లకు శిక్షణ కార్యక్రమాలు పునరుద్ధరించేందుకు జోక్యం చేసుకోవాలని శశిధర్‌రెడ్డి తన లేఖలో విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: