ప్రముఖ దేశీయ బ్యాంక్ ఎస్బిఐ పై జనాలకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే ఇటీవల కరోనా టైమ్ లో ఖాతాదారులకు వరాల జల్లును కురిపించింది. అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తూ వస్తుంది. ఎందరో బ్యాంక్ నుంచి రుణాలను పొంది, ఇప్పుడు సొంత బిజినెస్ లు చేసుకుంటూ నాలుగు చేతులా సంపాదిస్తున్నారు. అయితే , అవన్నీ కేవలం మార్చి 31 వరకు మాత్రమే అమల్లో ఉంది. ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం మళ్లీ రుణాల పై వడ్డీని వసూల్ చేయడం మొదలు పెట్టింది. ఇది నిజంగానే అందరికీ షాక్ ఇచ్చే విషయం అనే చెప్పాలి.


తాజాగా ఎస్బిఐ తీసుకున్న నిర్ణయం షాక్ ఇస్తుంది.దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) హోమ్‌లోన్లపై వడ్డీరేటును పెంచింది. మార్చి 31 వరకూ అతి తక్కువ వడ్డీ రేటు కు హోమ్‌లోన్ అందించిన ఎస్‌బీఐ.. ఆ గడువు ముగియడంతో వడ్డీరేటును 6.95 శాతానికి పెంచింది. ఈ కొత్త వడ్డీరేట్లు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చినట్లు ఆ బ్యాంకు తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఇంత వరకూ ఎస్‌బీఐను చూసి వడ్డీ రేట్లు తగ్గించిన ఇతర బ్యాంకులు కూడా ఇప్పుడు పెంచే అవకాశాలు ఉన్నాయి.


వడ్డీ రేటు పెంచడమే కాదు. ఇక నుంచీ అన్ని హోమ్‌లోన్లపై ప్రాసెసింగ్ ఫీజు కూడా వసూలు చేయనున్నట్లు బ్యాంకు స్పష్టం చేసింది. బ్యాంకు ప్రాసెసింగ్ ఫీజు రూపంలో 0.4 శాతం ప్లస్ జీఎస్టీ వసూలు చేస్తుంది. ఇది సాధారణంగా కనిష్ఠంగా రూ.10 వేలు, గరిష్ఠంగా రూ.30 ప్లస్ జీఎస్టీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.. పరిమిత సమయానికి గత నెలలో ఎస్‌బీఐ హోమ్‌లోన్లపై వడ్డీ రేటును తగ్గించడంతోపాటు ప్రాసెసింగ్ ఫీజును ఎత్తేసిన విషయం తెలిసిందే.. అయితే, ఇప్పుడు ఈ లోన్స్ తీసుకున్న వారు సందిగ్ధం లో ఉన్నారు. కొత్త గా తీసుకునే లోన్స్ పై అదనపు వడ్డీ ఉందా లేక ఇటీవల తీసుకున్న లోన్స్ పై కూడా ఈ వడ్డీ వర్తిస్తుందా అనేది బ్యాంక్ యాజమాన్యం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: