డబ్బు సంపాదించాలనే ఆశ ప్రతి ఒక్కరికీ ఉంటుంది.. కొన్ని స్కీమ్ లలో డబ్బులు ఇన్వెష్ట్ చేసి లక్షలు గడించాలని చాలా మంది భావిస్తుంటారు. కానీ, ఎటువంటి స్కీమ్ లో డబ్బులు పెడితే మంచి ఫలితం ఉంటుందని అంటున్నారు.. అస్సలు ఆలస్యం చేయకుండా ఆ స్కీమ్ ఎంటో ఒకసారి చూద్దాం... పోస్టాఫీసు సరికొత్త ఆఫర్లను అందిస్తుంది. కాగా, తాజాగా రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకొని సరికొత్త ఇన్సూరెన్స్ పాలసీని ప్రారంభించింది. 1995లో ప్రారంభమైన రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్ మొత్తం ఆరు రకాల ఇన్సూరెన్స్ పాలసీలను అమలు చేస్తోంది. అందులో గ్రామ్ సుమంగల్ స్కీమ్ కూడా ఒకటి.


కాగా, మనీ బ్యాక్ ఇన్సూరెన్స్ పాలసీ అయిన గ్రామ్ సుమంగల్ కింద కేవలం రోజుకు రూ .95 చొప్పున 20 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టి రూ .14 లక్షలు సంపాదించవచ్చు..


గ్రామ్ సుమంగల్ పాలసీ పోస్టల్ శాఖ అందజేస్తున్న ఒక మనీ బ్యాక్ పాలసీ.ఈ పాలసీకి గరిష్టంగా రూ .10 లక్షల వరకు హామీ ఇవ్వబడుతుంది.పాలసీలో చేరిన వారికి 6 ఏళ్లు, 9 ఏళ్లు, 12 ఏళ్లలో 20 శాతం చొప్పున డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. అందువల్ల, ప్లాన్ మధ్యలో డబ్బు పొందాలనుకునే వారికి ఈ స్కీమ్ అనుకూలంగా ఉంటుంది...

ఈ స్కీమ్ కింద పాలసీదారునికి మెచ్యూరిటీ ప్రయోజనాలు ఎప్పటికప్పుడు చెల్లించబడతాయి..పాలసీని 15 ఏళ్లు లేదా 20 ఏళ్ల వ్యవధితో తీసుకోవచ్చు.ఈ పాలసీలో చేరడానికి కనీస వయస్సు 19 సంవత్సరాలు. 45 ఏళ్ల వయస్సు వచ్చే వరకు15 ఏళ్ల వ్యవధి గల పాలసీని తీసుకోవచ్చు. అదేవిధంగా, 40 ఏళ్ల వయస్సు వచ్చే వరకు 20 ఏళ్ల టైం కలిగిన పాలసీని తీసుకోవచ్చు.


పాలసీ నియమ నిబంధనల ప్రకారం, వెయ్యికి వార్షిక బోనస్ రూ. 48 అనుకుంటే, రూ. 7 లక్షలకు వార్షిక బోనస్ రూ. 3,36,00 అవుతుంది. దీన్ని బట్టి మొత్తం పాలసీ వ్యవధి 20 ఏళ్లు పూర్తయ్యే సమయంలో మీకు బోనస్ కింద రూ .6.72 లక్షలు లభిస్తుంది. ఈ విధంగా, 20 సంవత్సరాల పాలసీ వ్యవధిలో రూ .4.2 లక్షల మేర మనీ బ్యాక్‌, రూ .9.52 లక్షల మెచ్యూరిటీ వంటివి చెల్లించబడతాయి.. ఇలా మొత్తం కలిపితే 13.80 లక్షల లాభం వస్తుంది.. ఈ స్కీమ్ ఎప్పుడైనా చేరవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి: