మరి టికెట్ ధర ఎలా ఉంటుందో అనే ఆలోచనలు రావడం సహజం. మనకున్న బడ్జెట్ లో విమాన టికెట్లను అందించడం లో స్పైస్ జెట్ ఎప్పుడూ ముందుంటుంది. ఎప్పటికప్పుడు కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లతో టికెట్స్ ను అందిస్తుంది. ఇకపోతే తాజాగా మరో బంపర్ ఆఫర్ ను స్పైస్ జెట్ అందిస్తుంది. పోరాడుతూ ప్రజలకు సేవలు అందిస్తున్న హెల్త్ కేర్ వర్కర్లకు విమాన టికెట్ల బేస్ ఫేర్‌లో 30 శాతం తగ్గింపు ను ప్రకటించింది. తాజాగా మరో ఆఫర్ ను అందిస్తున్నట్లు ప్రకటించింది.
బడ్జెట్ క్యారియర్ స్పైస్ జెట్ మెగా మాన్‌సూన్ సేల్‌ను ప్రారంభించింది. దీని కింద వివిధ దేశీయ గమ్యస్థానాలకు 999 రూపాయల నుంచి విమాన ప్రయాణ సేవలు అందిస్తున్నట్లు ప్రకటించింది. మరో విషయమేంటంటే ఈ విమానయన సంస్థ ప్రయాణికుల కు ఉచితంగా వోచర్ల ను కూడా అందిస్తుందట. కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో ఈ టికెట్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తుందట. జూన్ 25 వ తేదీ నుంచి ప్రయాణికుల కు ఆఫర్లు లభిస్తాయి. జులై 1 నుంచి 31 వరకు, ఆగస్టు 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీల మధ్య వోచర్ ఉపయోగ పడుతుందట.. దేశంలో ప్రయాణించే వారికి టికెట్ పై రాయితీ కూడా ఉంటుందని అధికారులు అంటున్నారు. ఇక ఆలస్యం ఎందుకు త్వరపడండి...
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి