
అయితే మిగిలిన మూడింటితోను మనకు పెద్దగా ఇప్పుడు సమస్య లేదని తెలుస్తుంది. ఎందుకంటే మనకి వాళ్ళకి మధ్యన లావాదేవీలు చాలా జరుగుతుంటాయి. వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు, మన అక్కడికి వెళుతూ ఉంటాం. ఆ విధంగా లెక్కలు సరిపోతాయి. కానీ ఇప్పుడు రష్యా కు సంబంధించి 41 బిలియన్ డాలర్ల ఆయిల్ ని కొన్నామని తెలుస్తుంది. అంటే 41 బిలియన్ డాలర్లకి సరి సమానమైన ఇండియన్ కరెన్సీ అక్కడే రష్యా బ్యాంకుల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది.
దాన్ని ఏం చేసుకోవాలో రష్యాకి తెలియడం లేదు. ఎందుకంటే అది వేరే రకంగా మారకం అవ్వదని తెలుస్తుంది. అది తీసుకొని చైనాలోనో, అమెరికాలోనో కొనడం కుదరదు. ఇంకా ఎక్కడా కొనడం కుదరదు అన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఈ సమస్యను కంట్రోల్ చేయడం కోసం నెక్స్ట్ సప్లైస్ ని మేము ఆపేస్తామన్నట్లుగా చెప్తుందట రష్యా. ఈ సమస్యను పరిష్కరించాలంటే అంతర్జాతీయ చలామణిలోకి రూపాయిని ప్రవేశపెట్టాలని అంటున్నారు నిపుణులు.
అమెరికాకు సంబంధించిన డాలర్ తరహాలో. అలా వదిలిపెడితే పెట్రోలు, డీజిల్, బంగారం వీటికి అంతర్జాతీయ ధరలకు ఆధారంగా మనం ఇక్కడ రూపాయల్లో వాడుతూ ఉంటాం. అంటే అంతర్జాతీయంగా ధరలు పెరిగితే ఇక్కడ ధరలు పెరుగుతాయి. అలాగే ధరలు తగ్గితే ఇక్కడా ధరలు తగ్గుతాయి. అలాగే రేపు మన రూపాయి కూడా అంతర్జాతీయ లెవెల్ లోకి వెళ్లాలంటే తెగించాలి. కానీ దీంట్లో రిస్క్ వస్తే మన పరిస్థితి పాకిస్తాన్ పరిస్థితి అయిపోతుందని అంటున్నారు.