కావాల్సిన ప‌దార్థాలు:
బేబీ కార్న్‌- ఒక‌ కప్పు
అల్లం- చిన్నముక్క
వెల్లుల్లి రెబ్బలు- రెండు
కొత్తిమీర- కొద్దిగా

 

పచ్చిమిర్చి- రెండు
క్యాబేజీ తురుము- మూడు స్పూన్లు
మిరియాలు- అర టీ స్పూన్‌
సోయా సాస్‌- ఒక టీ స్పూన్‌

 

మొక్కజొన్న పిండి- నాలుగు స్పూన్లు
క్యాప్సికం ముక్కలు- మూడు స్పూన్లు
పుట్టగొడుగులు- రెండు టేబుల్‌స్పూన్లు
ఉప్పు- రుచికి తగినంత

 

తయారీ విధానం: ముందుగా కార్న్‌, క్యాప్సికం, పుట్టగొడుగులను శుభ్రంగా క‌డిపెట్టుకోవాలి. ఇప్పుడు పాన్‌లో నూనె వేసి అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేగించాలి. త‌ర్వాత కార్న్‌, క్యాప్సికం ముక్కలు, పుట్టగొడుగులు, మిరియాలు, కొత్తిమీర వేసి మరికాసేపు వేగించాలి. ఇప్పుడు సోయాసాస్‌ వేసి కొద్దిగా నీళ్లు పోసి, తగినంత ఉప్పు వేసి మరిగించాలి. 

 

ఇప్పుడు నీళ్లు మరుగుతున్న సమయంలో మంటను తగ్గించి మొక్కజొన్న పిండి కలపాలి. దాంతో చిక్కగా సూప్‌లాగా తయారవుతుంది. చివరగా క్యాబేజీ తురుము వేసి ప‌ది నిమిషాలు ఉంచి స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. ఈ సూప్‌ను వేడి వేడిగా తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: