ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. స్పైసీ మసాలా బాత్ రైస్ చాలా రుచికరంగా ఉంటుంది. ఎంతో టేస్టీగా రుచికరంగా ఉంటుంది. ఇక ఈ టేస్టీ మసాలా బాత్ రైస్ ని మీరు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు.చాలా తొందరగా అయిపోతుంది. ఇది సాయంత్రం వేళ మంచి టిఫిన్ గా తినటానికి చాలా బాగుంటుంది..ఇక ఈ రుచికరమైన టేస్టీ ఇంకా స్పైసీ మసాలా బాత్ ఎలా తయారు చెయ్యాలో ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి...

కావాల్సిన పదార్ధాలు...

బియ్యం - అరకేజీ, పచ్చిమిర్చి - ఆరు, ఉల్లిపాయలు - రెండు, ఎండు కొబ్బరి పొడి - మూడు స్పూనులు, జీడిపప్పు - గుప్పెడు, నెయ్యి - అయిదు స్పూనులు, ఉప్పు - రుచికి సరిపడా, లవంగాలు - ఆరు, ధనియాల పొడి - ఒక టీస్పూను, జీలకర్ర పొడి - ఒక టీస్పూను, కరివేపాకు - గుప్పెడు, నువ్వుల పొడి - రెండు స్పూనులు, దొండకాయలు - ఆరు

స్పైసీ మసాలా బాత్ రైస్ తయారీ విధానం....

ముందుగా లవంగాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి కలిపి మెత్తటి పొడి చేసుకోవాలి. స్టవ్ కళాయి పెట్టి అందులో నెయ్యి వేయాలి. కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, నిలువుగా కోసిన దొండకాయల ముక్కలు వేసి వేయించాలి. ఇందులో లవంగాల మిశ్రమం వేసి బాగా కలపాలి. అందులోనే ఎండు కొబ్బరి పొడి, నువ్వుల పొడి కూడా వేసి వేయించాలి. కడిగిన బియ్యాన్ని అందులో వేసి వేయించి, తగినంత ఉప్పు వేసి కలపాలి. అన్నం ఉడకడానికి సరిపడా నీళ్లు పోయాలి. స్టవ్ కట్టేయానికి ముందు ఓసారి గరిటెతో కలిపేసి, పైన జీడిపప్పు చల్లాలి. అనంతరం స్టవ్ కట్టేయాలి. అంతే ఘుమఘుమలాడే మసాలా బాత్ రైస్ తయారైనట్లే... ఇక ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటకాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో రుచికరమైన వంటకాలు ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: