ఈ మధ్య కాలంలో చాలామంది బరువు తగ్గాలనే ఉద్దేశ్యంతో ఎక్కువగా చపాతీలు తింటున్నారు . అయితే చపాతీలకు సరైన కాంబినేషన్ ఉంటే తినడానికి రుచికరంగా ఉంటుంది.కూర అనేది రుచికరంగా ఉంటే ఎన్ని చపాతీలు అయిన ఇట్టే తినేయవచ్చు. అందుకే ఇండియా హెరాల్డ్ వారు మీకోసం చపాతీలోకి ఒక సరికొత్త మసాలా వెజ్ కుర్మా రెసిపీని మీకు వివరించబోతున్నారు. ఈ కూర ఒకసారి టేస్ట్ చేసారంటే ప్రతి రోజు ఇదే మసాలా వెజ్ కుర్మా చేసుకుని తింటారు.మరి ఆలస్యం చేయకుండా కర్రీకి ఎలా తయారు చేయాలో చూద్దామా. !

 కావాల్సిన పదార్ధాలు:

3 tbsp నూనె

4 యాలకలు

4 లవంగాలు

1.5 inch దాల్చిన చెక్క

1 tsp మిరియాలు

1 tbsp పచ్చశెనగపప్పు

1 tbsp మినపప్పు

4 మిరపకాయలు

1 tbsp కారం

1 cup పచ్చికొబ్బరి తురుము

1/2 cup ఉల్లిపాయ తరుగు

1/2 cup కేరట్ ముక్కలు

1/2 cup బటానీ

1/2 cup బంగాళా దుంప ముక్కలు

1/2 liter నీళ్ళు

1/2 tsp పసుపు

3 tbsp చింతపండు పులుసు

ఉప్పు
 
కొద్దిగా  బెల్లం

2 tbsp కొత్తిమీర తరుగు

తయారీ విధానం:

ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి అందులో నూనె వేడి చేసి  యాలకలు, లవంగాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు, దాల్చిన చెక్క, పచ్చి సెనగపప్పు, మినపపప్పు వేసి ఎర్రగా వేపుకుని  వాటిని మిక్సీలో వేసుకోని మెత్తగా చేసుకోండి.  అలాగే ఆ పేస్ట్ లో తాజా కొబ్బరి తురుము కూడా వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి.బాండీలో ఉన్నా నూనెలో ఉల్లిపాయ ముక్కలు,  కేరట్ తరుగు,బటానీ, బంగాళాదుంప ముక్కలు వేసి వేపుకోండి. అవి వేగిన తరువాత ఆ ముక్కల్లో అర లీటర్ నీళ్ళు పోసి మూత పెట్టి చిన్న మంట మీద  ఉడికించాలి. ముక్కలు సగం ఉడికిన తరువాత మెత్తగా రుబ్బుకున్న మసాలా పేస్ట్ తో పాటు, పసుపు, ఉప్పు, కారం వేసి బాగా కలిపి మూత పెట్టండి. నూనె పైకి తేలేదాక కుర్మాని ఉడకనివ్వండి. నూనె పైకి కనిపించిన తరువాత అందులో కొద్దిగా బెల్లం,  కొత్తిమీర తరుగు వేయాలి. బెల్లం మీకు నచ్చితేనే వేసుకోండి.








మరింత సమాచారం తెలుసుకోండి: