ఇక్కడ ఓ మేనమామ ఇలాంటి నీచానికి ఒడిగట్టాడు. మేనమామ అంటే కోడల్ని ఎంతో అపురూపంగా చూసుకోవాలి. ఏకంగా కూతురిలా చూసుకుంటూ సంతోషంగా ఉంచాలి. కానీ ఇక్కడ మాత్రం డబ్బుకోసం కక్కుర్తి పడ్డాడు మేనమామ. ఏ సమస్య రాకుండా చూసుకోవాల్సిన మేనమామ 7 ఏళ్ల వయసున్న బాలిక పాలిట ఎంతో పెద్ద సమస్యగా మారి పోయాడు. డబ్బు కోసం ఏకంగా మేనకోడలికి కిడ్నాప్ చేయించాడు. చివరికి పోలీసులకు దొరికి కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన కర్నాటకలోని బాగల్కోట్ నవ నగర్ లో వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతంలో సునీత అనే మహిళ నివాసం ఉంటుంది. ఆమెకు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు.
అయితే ఇటీవలే పిల్లలను ట్యూషన్ నుంచి తీసుకు వస్తున్న సమయంలో మేనమామ మరో ముగ్గురు దుండగులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే 7ఏళ్ల బాలికను కారులో బలవంతంగా ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక ఆ తర్వాత తల్లిదండ్రులకు ఫోన్ వచ్చింది. 50 లక్షలు ఇవ్వాలని లేదంటే మీ కూతురు మీకు దక్కదు అంటూ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. మొదట సునీతకు ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో ఆ బాలికను ఇంటివద్ద వదిలేసి పరారయ్యాడు. ఈ క్రమంలోనే బాలిక చెప్పిన వివరాలతో మేనమామను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా నేరం ఒప్పుకున్నాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి