ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా దొంగల బెడద రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది. గౌరవంగా ఉద్యోగమో వ్యాపారమో చేసుకుని సభ్యసమాజంలో బ్రతకడం కంటే దొంగతనాలకు పాల్పడుతూ అందినకాడికి దోచుకుని జల్సాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతేకాదు ఎంతోమందికి ఆర్థిక సమస్యలు కూడా దొంగలుగా మారడానికి కారణం గా మారిపోతున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ కాలంలో అయితే ఎంతో మంది దొంగల గా మారిపోయారు అనే విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో దొంగల బెడద మాత్రం ఎంతో మందికి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.



సాధారణంగా దొంగలు ప్లాన్ ప్రకారం ఇంట్లోకి ప్రవేశించి ఇక విలువైన వస్తువులను దొంగలించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఎవరూ లేని సమయంలోనే దొంగతనాలకు పాల్పడెందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ఒకవేళ ఇంట్లో ఎవరైనా గమనిస్తే వెంటనే అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ దొంగలు మాత్రం రెచ్చి పోయారు. ఇంట్లోకి దొంగ తనానికి వెళ్లారు. అయితే ఇంటి యజమాని వాళ్ళని అడ్డుకునేందుకు ప్రయత్నించడం తో దాడికి తెగబడ్డారు.


 ఏకంగా ఇంటి యజమాని దారుణం గా హత్య చేసి పరారయ్యాడు దొంగలు. ఈ ఘటన స్థానికం గా ఒక్క  సారిగా ఉలిక్కి పడేలా చేసింది. అనంతపురం జిల్లా కదిరి లో ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది. ఇంట్లోకి చోరీకి వచ్చిన దొంగలు.. ఇక మహిళా వారిని గమనించడం తో ఏకంగా దారుణం గా చంపేశారు. మృతురాలు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కావటం గవర్నర్. భర్త మార్నింగ్ వాక్ కు వెళ్ళిన సమయంలో దుండగులు చోరీ చేసేందుకు ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. అయితే ఇక దొంగలను అడ్డుకోబోయిన మరో మహిళకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక వెంటనే స్థానికులు ఆమెను అనంతపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: