నేటి రోజుల్లో మనుషులు బంధాలకు బంధుత్వాలకు అసలు విలువ ఇవ్వడం లేదు అన్న విషయం తెలిసిందే. మూడుముళ్ల బంధంతో ఒక్కటైన బంధాలకు విలువ ఇవ్వకుండా పరాయి వ్యక్తులతో మోజులో పడి చివరికి కాపురంలో చిచ్చు పెట్టుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా రోజురోజుకు దారుణమైన ఘటనలు సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి. శారీరక సుఖం కోసం చేయకూడని నీచమైన పనులన్నీ చేస్తూ ఉన్నారు ఏకంగా వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని కట్టుకున్న వారిని దారుణంగా హతమార్చిన ఘటన లు కూడా నేటి రోజుల్లో కోకొల్లలు అని  చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.


 ఇక్కడ ఓ కోడలు తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించి ప్రియుడి సహాయంతో చివరికి సొంత మామనే దారుణంగా హతమార్చిన ఘటన నిజాంబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో వెలుగులోకి వచ్చింది. పొలంలో వడ్ల కుప్పపై పడుకున్న సమయంలో మామ ను దారుణంగా కొట్టి చంపింది కోడలు. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపడం తో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోడలి వివాహేతర సంబంధమే మామ హత్యకు కారణం అన్న విషయాన్ని పోలీసులు తేల్చారు.


 మృతుడు గంగారామ్ కు ఇద్దరు కుమారులు అయితే చిన్న కొడుకు బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్ళాడు. అతని భార్య అత్తమామల దగ్గరే ఉంటుంది. కాగా మదనపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే సమీప బంధువు గంగారాం పొలం కౌలుకు తీసుకొని సాగు చేస్తున్నాడూ. ఇక శ్రీనివాస్ కి లత కి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం మామ గంగరాజు కు తెలిసింది. తీరూ మార్చుకోవాలి  చెప్పాడు.  ఈ విషయమై పలుమార్లు గొడవ కూడా జరిగింది. ఆ తర్వాత కోపంతో పుట్టింటికి వెళ్ళింది లత. తిరిగి వచ్చి తన పంటపొలం తనకు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. కానీ ఇవ్వటం కుదరదు అని చెప్పడంతో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చేందుకు ప్లాన్ వేసింది. ఈ క్రమంలోనే వడ్ల కుప్ప పై పడుకొని గంగారం ఛాతి పైన కూర్చొని శ్రీనివాస్ వెదురు కర్రలతో గొంతు నులిమి హత్య చేశాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి వీరిని అడ్డుకోవాలని చూస్తే అతని పై కూడా హత్యాయత్నం చేశారు. ఇంతలోపు మరికొంతమంది రావడంతో ఇద్దరు పరారయ్యారు. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చివరికి వీరిని అరెస్టు చేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: