ఒడిషాలోని భువనేశ్వర్లో కూడా ఇటీవలే ఇలాంటి తరహా విషాదకర ఘటన జరిగింది. సంజు అనే 40 ఏళ్ల మహిళ ఉరివేసుకొని మృతి చెందింది. ఈ క్రమంలోనే ఇది తట్టుకోలేకపోయిన భర్త సంజయ్ చివరికి యాసిడ్ తాగి ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. సిద్దేశ్వర అపార్ట్మెంట్లో సంజయ్, సంజూ దంపతులు ఉంటున్నారు. ఇక వీరికి ఆ ప్రాంతంలో ఒక వస్త్ర విక్రయ దుకాణం ఉంది. ఇక ఇటీవలే ఉదయం సమయంలో భర్త సంజయ్ దుకాణానికి వెళ్లాడు. ఇక పిల్లలు కూడా పాఠశాలకు వెళ్ళిపోయారు.
అయితే భార్య సంజు ప్రతిరోజు భర్తకు సహాయం చేసేందుకు త్వరగా ఇంటి పనులు పూర్తి చేసుకుని దుకాణానికి వెళ్ళేది. కానీ ఇటీవలే మాత్రం ఆమె దుకాణానికి రాకపోవడంతో సంజయ్ ఏం జరిగిందా అని ఫోన్ చేశాడు. ఇక ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అదే దుకాణంలో పనిచేసే ఒక మనిషిని ఇంటికి పంపించాడు. అతను వచ్చి చూసేసరికి సంజూ ఫ్యాన్కు వేలాడుతూ కనిపించడంతో వెంటనే హడలి పోయాడు. యజమానికి సమాచారం అందించాడు. అయితే ఇంటికి వెళ్లి భార్య ఉరి వేసుకున్నది చూసిన సంజయ్ మనస్థాపంతో బాత్రూంలో యాసిడ్ తాగేశాడు. స్థానికులు గమనించి వెంటనే సంజయ్ ను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాల వల్లే ఇదంతా జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి