సాధారణంగా తండ్రి కూతుర్ల బంధం ఎంతో ప్రత్యేకమైనది అని చెబుతూ ఉంటారు. తండ్రి కొడుకు కంటే ఎక్కువగా కూతురు పైన ప్రేమ చూపిస్తారు అని అంటూ ఉంటారు. కొడుకు విషయంలో కాస్త గంభీరంగా ఉండే తండ్రి కూతురు విషయంలో మాత్రం చిన్న పిల్లాడిలా మారిపోతాడు అంటూ ఉంటారు. కూతురికి ఏ కష్టం వచ్చినా అస్సలు తట్టుకోలేరు అని చెప్పాలి. కానీ ఇక్కడ ఒక కసాయి తండ్రి మాత్రం ఏకంగా కన్న కూతురినే హతమార్చేందుకు ప్లాన్ వేసాడు. తన కూతురు తనకు ఇష్టం లేని వాడిని ప్రేమించింది అన్న కారణంతో చివరికి కన్నా పేగు బంధాన్ని కూడా మరిచిపోయాడు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది.


 ఇందుకోసం లక్ష రూపాయల సుపారీ కూడా ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఆ తండ్రి తన కూతురిని హాస్పిటల్ కు తీసుకువెళ్లగా యువతిని చంపేందుకు సుపారీ తీసుకున్న వార్డు బాయ్ ఏకంగా పొటాషియం క్లోరైడ్ హై డోస్ ఇచ్చాడు.  దీంతో ఆ యువతి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది వెంటనే మరో ఆస్పత్రికి తన కూతుర్ని తీసుకువెళ్లాడు సదరు వ్యక్తి. ఇక క్రమక్రమంగా ఆమె ఆరోగ్యం మరింత దిగజారిపోతు వచ్చింది. అయితే విషయాన్ని పరీక్షించగా ఆమెకు పొటాషియం క్లోరైడ్ ఇచ్చినట్లు గుర్తించారు వైద్యులు. ఆ అమ్మాయికి ఇంజక్షన్ ఇచ్చిన వ్యక్తి నరేష్ కుమార్ అని తేలింది.


 ఈ క్రమంలోనే పోలీసులు రంగప్రవేశం నరేష్ కుమార్ ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. తన కూతురు ని చంపడానికి ఆ అమ్మాయి తండ్రి లక్ష రూపాయలు ఇచ్చాడు నరేష్ పోలీసు విచారణలో ఒప్పుకున్నాడు. ఈ క్రమంలోనే పోలీసులు ఆ అమ్మాయి తండ్రిని ఇక ఇందుకు సహకరించిన మహిళా ఉద్యోగిని కూడా కస్టడీలోకి తీసుకోవడం గమనార్హం. అయితే ఇక ఆ అమ్మాయి తండ్రి కూడా పోలీసుల ముందు నేరాన్ని ఒప్పుకున్నాడు. తనకు ఇష్టం లేని యువకుడిని ప్రేమించడం కారణంగానే ఇలాంటిది చేశానని ఎన్నిసార్లు హెచ్చరించిన తమ కూతురు వినకపోవడంతో హత్య చేయాలని ప్లాన్ చేసినట్లు తండ్రి నేరం అంగీకరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: