ఇటీవల కాలం లో ఎక్కడ చూసినా కూడా దొంగల బెడద కాస్త ఎక్కువైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే అటు జనాలు ఎప్పటికప్పుడు అప్రమత్తం గా ఉంటున్నారు.  అయినప్పటికీ దోపిడీ దొంగలు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు కొత్త మార్గాలు ఎంచుకుంటూ అందిన కాడికి దోచుకు పోతున్నారు అని చెప్పాలి. ముఖ్యం గా ఇటీవల కాలంలో చైన్స్ నాచర్ల బెడదా ఎక్కువ అయి పోయింది. చైన్ స్నాచర్స్ లని పట్టుకునేందుకు అటు పోలీసులు కూడా ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ దొంగల ఆట కట్టిస్తున్నారు.

కాగా చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర ఘరానా దొంగల ముఠాను ఇటీవల టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపు లోకి తీసుకున్నారు. అయితే ఈ కేసును చేదించే క్రమం లో ఎన్నో కేసులకు సంబంధించిన విషయాలు కూడా వెలుగు లోకి వచ్చాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనె కరీంనగర్ జిల్లాలో జరిగిన  చల్పూరి పెద్ద స్వామి హత్యతో పాటు మరికొన్ని కేసులకు సంబంధించిన చిక్కుముడి కూడా వీడింది.


 ఈనెల 4వ తేదీన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చైన్ స్నాచింగ్ కేసు నమోదైంది. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు   అయితే కేసు నమోదు చేసుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం వేట ప్రారంభించారు అని చెప్పాలి. అమీర్పేట్ లోని మైత్రివనం వద్ద నిందితులు ఉన్నారని పోలీసులు గుర్తించారు. కాగా మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు గ్రామానికి చెందిన జ్ఞానేశ్వర్, ములుగు జిల్లా వెంకటాపూర్ గ్రామానికి నిజం శ్రీనివాసులు ఇద్దరిని అదుపులోకి  తీసుకున్నారు.  వారి దగ్గర నుంచి 10.4 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఇక వారిని విచారించగా చల్పూరి పెద్ద స్వామి హత్య నిందితులు వారే అన్న విషయం తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: