ఇటీవల కాలంలో పెంపుడు కుక్కలకు మనుషులకు మధ్య ఉన్న బంధం మరింత బలపడింది అని చెప్పాలి . ఏకంగా కుక్కలను పెంచుకోవడానికి ఇంట్లోకి తెచ్చుకుంటున్న ఎంతోమంది ఇంట్లో మనిషి లాగానే కుక్కలను కూడా ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు. అయితే మరి కొంతమంది కేవలం ట్రెండ్ ఫాలో అవ్వడానికి మాత్రమే కుక్కలను ఇంట్లోకి తెచ్చుకుంటున్న  కొంత సమయంలోనే ఇక పెంపుడు కుక్కలతో ప్రేమలో పడిపోయి వాటితో ప్రత్యేకమైన బంధాన్ని ఏర్పరచుకుంటూ ఉన్నారు అని చెప్పాలి. అంతే కాదండోయ్ కొంతమంది జంతు ప్రేమికులు అయితే మనుషుల మీద చూపించిన ప్రేమ ఆప్యాయతల కంటే కుక్కల మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు.


ఇలా మనుషులకి కుక్కలకి మధ్య బంధం  బాగా బలపడిన నేటి రోజుల్లో కూడా కొంతమంది మాత్రం ఏకంగా అమానవీయ ఘటనలకు పాల్పడుతున్నారు. దారుణంగా చంపేస్తూ ఉన్నారు. ఇటీవల హర్యానాలోని అంబాలాలో కూడా ఇలాంటి దారుణ ఘటన వెలుగు చూసింది. లక్ష్మీ నగర్ లో ఓ పెంపుడు కుక్కను గుర్తుతెలియని కొందరు దుండగులు దారుణంగా చంపేశారు. పదునైన ఆయుధాలతో కుక్క వెనక కాళ్ళను నరికేసి చివరికి ప్రాణాలు తీశారు. అయితే ఇలా కుక్కపై దాడి జరిగిన సమయంలో ఇక యజమాని ఇంట్లో లేకపోవడం గమనార్హం. అయితే కుక్క చనిపోగా ఇక దానిని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఫోరెన్సిక్ రిపోర్టులో మాత్రం షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.


 పదునైన ఆయుధాలతో కుక్కపై దాడి చేసిన నేపథ్యంలో ఇక తీవ్ర రక్తస్రావం కారణంగా కుక్క చనిపోయింది అన్నది మాత్రం తెలుస్తుంది. అయితే కుక్క వెనక కాళ్ళను పదునైన ఆయుధంతో నరికి తలపై కూడా కర్రతో కొట్టినట్లు పోస్టుమార్టం రిపోర్టుల్లో వెల్లడైంది.  కాగా చనిపోయిన కుక్కను యజమాని ఎంతో ప్రేమగా షాడో అని పిలుస్తాడట. తన కుక్కను చంపారు అన్నది బయట ఉన్న తనకు స్థానికులు చెప్పితేనే తెలిసిందని.. దీనిపై మొదట్లో ఇక పోలీసులు కూడా కేసు నమోదు చేయలేదని.. కానీ వీధి కుక్కలు, జంతు సంరక్షణ సంఘాలు, కొన్ని సామాజిక సంస్థలు ఇక డిమాండ్ చేయడంతో చివరికి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యజమాని తెలిపారు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: