ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు చూసిన తర్వాత మనుషుల్లో ఉండే మానవత్వం పూర్తిగా కనుమరుగైపోతుందేమో అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఎందుకంటే ఒకప్పుడు ముక్కు ముఖం తెలియని వారికి ఏదైనా అపాయం కలిగితేనే అయ్యో పాపం అంటూ సహాయం చేయడానికి ముందుకు వెళ్లే వాడు మనిషి. కానీ ఇప్పుడు సాటి మనుషుల విషయంలో అలాంటి మానవత్వాన్ని చూపించలేకపోతున్నాడు. నేను అనే స్వార్థం పేరుకుపోయిన మనిషి సొంత వారి విషయంలో కూడా కాస్తయినా జాలీ దయ లేకుండా ప్రవర్తిస్తున్న ఘటనలు చాలానే  వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి.


 ఇలా మనుషుల్లో ఉండాల్సిన మానవత్వం పూర్తిగా మంట కలిసి పోయింది అని నిరూపించే ఘటనలు నేటి రోజుల్లో కోకోలలుగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత మనుషులు మరి ఇంత దారుణంగా తయారయ్యారా అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి తరహా ఘటన గురించే అని చెప్పాలి. ఇంటి ఓనర్ చేసిన పని కారణంగా ఏకంగా ప్రాణాలు కోల్పోయిన లచ్చయ్య అనే వ్యక్తి మృతదేహాన్ని ఎక్కడ సందర్శనకు పెట్టకుండా నేరుగా స్మశాన వాటికకే తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.


 ఈ అమానవీయ ఘటన మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.. చేగుంట వాసి మంద లచ్చయ్య అనే 45 ఏళ్ల వ్యక్తి అనారోగ్యంతో ఇటీవల చనిపోయాడు. అయితే కుటుంబ సభ్యులు అతని మృతదేహాన్ని సందర్శనార్థం ఇక అతను రెంటుకి ఉంటున్న ఇంటి ముందు ఉంచేందుకు తీసుకువచ్చారు. కానీ ఇంటి యజమాని మాత్రం మృతదేహాన్ని ఇంటి ఆవరణలో ఉంచేందుకు ఒప్పుకోలేదు. ఎంత బ్రతిమిలాడినా ఆ ఇంటి యజమాని మనసు కరగలేదు. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు నేరుగా మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఇక స్మశాన వాటికకు తరలించారు. అయితే ఇలా అమానవీయంగా ప్రవర్తించిన ఇంటి యజమాని పై విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: