ఒకసారి మూడుముళ్ల బంధంతో ఒక్కటై వైభవిక బంధంలోకి అడుగుపెట్టిన జంట ఇక కలకాలం కలిసి మెలిసి ఉండాలి. కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటూ సుఖ సంతోషాలతో జీవనాన్ని సాగించాలి  కానీ ఇటీవల కాలంలో మాత్రం భార్యాభర్తల బంధం లో ఇలాంటి అన్యోన్యత  మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. పెళ్లయిన సంవత్సరానికే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం విభేదాలు రావటం విడాకులు తీసుకునేందుకు కోర్టు మెట్లు ఎక్కే వరకు వెళ్లడం జరుగుతోంది. నేటి జనరేషన్లో జీవనశైలి, పని ఒత్తిడి, తమదే డామినేషన్ ఉండాలి అనే ఆలోచన, వివాహేతర సంబంధాలు ఇలా చాలా కారణాలు భార్యాభర్తల మధ్య గొడవలకు ఆ బంధం విడిపోవడానికి కారణం అవుతున్నాయి.


 మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో అయితే పచ్చటి కాపురాలు అటు ఎన్నో కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఏకంగా భార్యాభర్తలు ఒక్కరితో ఒకరు గొడవ పడటం కాదు.. ఏకంగా  కడవరకు తోడుంటాం అని ప్రమాణం చేసిన వారిని దారుణంగా చంపేసేంతవరకు కూడా వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక దుర్మార్గమైన భర్త ఇలాంటిదే చేశాడు. ఏకంగాఒక మహిళను పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో జీవనం సాఫీగానే సాగుతుంది. కానీ మరో మహిళపై మనసు పడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకున్నాడు. చివరికి మొదటి భార్యను   చంపేందుకు ప్రయత్నం చేశాడు ఆ దుర్మార్గపు భర్త. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో వెలుగులోకి వచ్చింది.


 మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో ఒక షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.  ఒక వ్యక్తి తన భార్యను ఇటుకతో కొట్టి కత్తితో పొడుస్తూ దారుణంగా హింసించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. జితేంద్ర ఫర్మర్, పూజ పర్మర్ భార్యాభర్తలు. అయితే భార్య బతికి ఉండగానే జితేంద్ర మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యతో ఇదే విషయంపై తరుచు గొడవలు అవుతున్నాయి. ఇక పంచాయితీ పెట్టిన భర్త తీరులో మాత్రం మార్పు రాలేదు. అయితే ఇటీవల పూజా ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మరోసారి భార్యతో గొడవపడ్డాడు జితేంద్ర. ఈ క్రమంలోనే ఆమెపై ఇటికతో దాడి చేయడంతో పాటు కత్తితో పొడిచాడు. అంతేకాదు బిల్డింగ్ పైనుంచి కిందకు తోసేసేందుకు ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: