ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే కాలం మారిపోయిందని అనడంలో ఎలాంటి సందేహం లేదు .. పెళ్లి పేరు తో మగాళ్లు మోసం చేసే రోజులు పోయాయి .. ఇప్పుడు ఆడవాళ్లు మోసం చేసే రోజులు వచ్చేసాయి .. అయితే అవి ప్రేమించి మోసాలు చేయటాలు అంటే ఎంతో కామన్ అనుకోవచ్చు కానీ .. అచ్చంగా మోసం చేయడానికి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు .. కర్ణాటకలో ఓ పెళ్ళికాని ప్రసాద్ .. పెళ్లి కోసం ఎన్నో సంబంధాలు చూసుకున్న ఏది సెట్ కాలేదు .. మధ్యవర్తుల ద్వారా విజయవాడలో అమ్మాయి ఉందని తెలుసుకొని అక్కడికి వచ్చారు .. మధ్యవర్తులు విజయవాడ దుర్గ గుడిలోనే పెళ్లి కూడా చేశారు .. ఎదురు కట్నాలు ఇతర విధంగా అందినంత సొమ్ము తీసుకున్నారు తర్వాత అందరూ వెళ్లిపోయారు .. అసలైన విషయం ఏమిటంటే అప్ప‌టి నుంచి పెళ్లికూతురు కూడా ఎక్కడ కనిపించకుండా పోయింది ..


 ఇక దాంతో వారంతా పోలీసులకు కంప్లైంట్ చేశారు .. పోలీసులు ఆశల విషయం బయటపెట్టారు . ఇక అలా పెళ్లి చేసుకున్న అమ్మాయి ముగ్గురు పిల్లల తల్లి .. ఇలా పెళ్లికూతురులా నటిస్తే 50,000 ఇస్తామని చెప్పటంతో అందుకు ఒప్పుకొని మూడు రోజులు అలా నటించి తర్వాత తన దారి తాను చూసుకుందాని పోలీసులకు చెప్పడంతో వారి మైండ్ బ్లాక్ అయింది .. అయితే ఆమె అసలు మోసం చేసే ముఠాతో కలిసి ఈ పని చేస్తుందని పోలీసులు అనుమానిస్తున్నారు అలాగే ఆ ముఠా కోసం వెతుకుతున్నారు .. అయితే పెళ్లి తర్వాత ఒక పక్క పరువు పోయి .. ఇంకోపక్క డబ్బులు పోగొట్టుకున్న పెళ్లికొడుకు మీడియా ముందు బోరున కన్నీళ్లు పెట్టుకున్నారు .. అతని బాధ చూసిన ఎవరికైనా మగజాతికి ఇంత కష్టం వచ్చింది ఏంట్రా అని జాలి పడకుండా ఉండలేరు .  ఇక రాబోయే రోజుల్లో మగాళ్లకు పెళ్లిళ్లు విషయంలో ఇంకేం ఇబ్బందులు వస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: