
దీనిపై టీడీపీ అభిమానులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, బాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరూ రోడ్డెక్కి ధర్నాలు నిరసనలు చేస్తున్నారు. దీనికి తోడు పవన్ కల్యాణ్ కూడా లోకేశ్ కు తోడుగా చంద్రబాబును రాజమండ్రి జైలులో కలిసి చర్చలు జరిపారు. టీడీపీతో కలిసి పోటీ చేస్తానని జైలు బయట ప్రకటించారు. అయితే చంద్రబాబు కేసు విషయంలో ఎలాంటి తప్పులు జరిగాయి.. ఎక్కడా జరిగాాయి. అనే వివరాలతో సాక్షి పత్రిక అన్ని వివరాలు బయట పెడుతోంది.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు షెల్ కంపెనీలకు డబ్బులు ట్రాన్స్ పర్ చేసిన విధానం సిమెన్స్ పేరుతో డిజైన్ టెక్ అనే సంస్థలో 387 కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారినట్లు పక్కా ఆధారాలను సీఐడీ సేకరించింది. అందులో భాగంగా 240 కోట్ల రూపాయలను చంద్రబాబు బినామీ షెల్ కంపెనీలకు హవాల మార్గంలో తరలించినట్లు పేర్కొంది. ఇందులో భాగంగా ఊరు పేరు లేని కంపెనీలకు అప్పనంగా నిధులిచ్చినట్లు పేర్కొంది.
నిజనిజాలు తెలుసుకునేందుకు కోర్టు కూడా చంద్రబాబు తరఫున లాయర్లకు వీలైనంత సమయం కేటాయించినట్లు దాదాపు 10 గంటలకు పైగా వాదనలు విన్నట్లు తెలిపింది. ఎలాంటి టెండర్లు లేకుండా అయిదు విడతల్లో 380 కోట్లు కేటాయించినట్లు ఈడీ, ఐటీ తెలిపింది. ఏపీతో ఒప్పందానికి సిమెన్స్ సంస్థ సిద్ధంగా ఉన్నట్లు ఈనాడులో కూడా వార్తలు వచ్చాయి. సిమెన్స్ ఆడిటింగ్ లో ఈ విషయం బయటపడితే ఆ కంపెనీ అధికారులు ప్రభుత్వానికి చెబితే దాన్ని పక్కన పెట్టినట్లు చెప్పిన విషయంలో వాస్తవాలు నిర్ధారించుకోవాలి.