ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఎల్లో మీడియాలో ఏపీకి పెట్టుబడులు ఏం రావడం లేదు. వచ్చిన కంపెనీలు కూడా వెనక్కి వెళ్లిపోతున్నాయ్. ఏపీ మరో శ్రీలంక అవుతుంది.. ఏ మాత్రం అభివృద్ధి జరగడం లేదు అని వార్తలు రాస్తున్నారు.  

వైసీపీ అనుకూల మీడియాకు వచ్చే సరికి విశాఖలో జరిగిన సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడుల వరద వచ్చింది. దేశలో ఏ రాష్ట్రానికి ఈ తరహా పెట్టుబడులు రాలేదు. గతంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి వైసీపీ హయాంలో జరుగుతుంది అని వార్తలు రాస్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఏంటనేది మాత్రం అక్కడి ప్రజలకే తెలియాలి.

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ర్టీ అండ్ ఇంటర్నల్ ట్రీ (డీపీఐఐటీ) తాజా గణాంకాల ప్రకారం ఏపీకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయనే పేర్కొంది.  కరోనా లాక్ డౌన్ సమయంలో దేశంలో లేని ఎక్కడా లేని విధంగా రీ స్టార్ట్ ప్యాకేజీతో పరిశ్రమలను ఆదుకోవడంతో ఏపీ పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా పలు కంపెనీ ప్రతినిధులు ఎంచుకొంటున్నారు. 2021లో రూ. 9,371 కోట్ల విలువైన పెట్టుబడుల కోసం 47 ఒప్పందాలు కుదిరితే 2022లో 54 యూనిట్ల ద్వారా రూ. 16,137 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయి. ఏడాది తొలి త్రైమాసికంలో 18 యూనిట్ల ద్వారా రూ. 7,187 కోట్ల ఒప్పందాలు జరిగాయి.

అంటే గత 27 నెలల్లో కొత్తగా 119 యూనిట్లను ఆకర్షించడం ద్వారా రూ.32,697 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. మార్చిలో విశాఖలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ సదస్సులో 387 కంపెనీల ద్వారా రూ.13.11లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయి. గరిష్ఠంగా ఆరు నెలల్లో పనులు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందంటూ పేర్కొన్నారు. కొత్త పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా సాధ్యమైనంత వరకు ఉత్పత్తులు ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందించారని తెలిపింది. పెట్టుబడులు స్పష్టంగా అమలవుతున్నట్లు నివేదికలో తెలిపింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

AP