ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్: నీకు ఎలా ఉందో గాని... నాకు మాత్రం మ్యాచ్ ఎప్పుడు మొదలవుతుంది అన్నట్టే ఉంది. నాకు క్రికెట్ అంటే పిచ్చి బ్రో. ఎవరు ఎలా ఆడతారు ఏంటీ... కోహ్లీ ఇన్నింగ్స్ ఏంటీ, రోహిత్ మెరుపులు ఎలా ఉంటాయి అనేది ఒక రేంజ్ లో ఎదురు చూస్తున్నా. చల్లటి గాలిలో బంతి ఏ రేంజ్ లో స్వింగ్ అవుతుంది, ఆ స్వింగ్ ని మన ఓపెనర్లు ఎలా ఎదుర్కొంటారు అనేది నాకు అయితే ఒక రేంజ్ ఆసక్తి ఉంది. 2011  ప్రపంచ కప్ ఫైనల్ లో మనవాళ్ళే గెలవాలి అనుకున్నా గాని ఇప్పుడు మాత్రం క్రికెట్ గెలవాలనేది నా కోరిక.


ఎందుకు అంటావా... మన కెప్టెన్ కోహ్లీది ఏముంది దూకుడుగా ఆడతాడు సెంచరీ చేస్తాడు. ఎవరు వికెట్ తీసినా గంతులు వేస్తాడు. కాని విలియమ్సన్ అలా కాదే. ఆట మొత్తం మైండ్ గేమ్. ఏం చేయాలో అతనికి ఒక పిచ్చ క్లారిటీ ఉంది. ఇక్కడ నేను కోహ్లీకి చెప్తాం బ్రో... క్రికెట్ ఫాన్స్ గా...


“కోహ్లీ నీ కెరీర్‌లో కఠినమైన ప్రత్యర్దిని ఎదుర్కోబోతున్నావ్... ఇక్కడ జరిగేది క్రికెట్‌ కాదు మైండ్ గేమ్... ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌... ఓవర్ ఓవర్‌కి అతను ఎలా ఆలోచిస్తాడో అతనికే తెలీదు... బ్యాటింగ్ ఆర్డర్‌ సిచ్యేషన్ బట్టీ మార్చేస్తాడు... నువ్వు వికెట్‌ పడితే గెంతులేస్తావ్... అతను తర్వాతి బ్యాట్స్‌మెన్ క్రీజ్‌లో ఎలా ఉండాలో మెంటల్‌గా ప్రిపేర్‌ చేసి పంపిస్తాడు... ప్రపంచకప్‌ గెలవడం ఏముంది... 100 ఓవర్ల ఆట... 450 ఓవర్లు ఆడాలి... తన టీంని 450 ఓవర్లు గ్రౌండ్‌లో ఉంచుతాడు... నువ్వు ఎంత వరకు ఉంచుతావో ఆలోచించు...నీ కోపం... అతని సైలెన్స్ ముందు నిలబడదు... నీ బౌలర్ మానసిక పరిస్థితి గురించి కూడా అతనికి తెలుసు... ప్రతీ క్రికెటర్‌ని మానసికంగా అంచనా వేస్తాడు... లోపాలన్నీ గుర్తిస్తాడు... ఫీల్డింగ్‌ వైఫల్యాలు అంచనా వేస్తాడు... బ్యాటింగ్ బలాలు అంచనా వేస్తాడు... టెయిలెండర్‌తో కూడా మ్యాచ్‌ని ముందుకు నడిపిస్తాడు... క్రికెట్‌ని నువ్వు నేర్చుకున్నావ్... అతను నమిలి మింగేసాడు... ప్రపంచకప్ ఓడిపోయినా రూల్స్‌ని ఒక్క మాట అనలేదు... క్యాచ్ వదిలేసి ప్రత్యర్దికి అదనపు పరుగులు ఇచ్చిన బౌల్ట్‌తో చివరి ఓవర్ వేయించాడు... అవసరం అయితే ద్రావిడ్‌ని నీతో ఉంచుకో...


నేను నమ్ముతున్నా క్రికెట్ చరిత్రలో ది బెస్ట్ మ్యాచ్‌ కాబోతుంది... ప్రతీ ఓవర్ మ్యాచ్‌ చూస్తా...” ఇది నేను కోహ్లీకి చెప్తున్నా... నా ఫేస్బుక్ లో నేనే రాసుకున్నా ఇది. విలియమ్సన్ మొండి ఘటం. మాట వినడు... అతనికి ఎవరితో సంబంధం లేదు కదా... నీకు రోహిత్ శర్మ ఉండొచ్చు, పంత్ ఉండొచ్చు, బూమ్రా ఉండొచ్చు. కాని  వాళ్లకు విలియమ్సన్ ఒక్కడే ఉన్నాడు. 11 మందిలోనూ విలియమ్సన్ ఉంటాడు అని క్రికెట్ జనాలు అంటున్నారు.


వాళ్ళ టీం ఇది. కేన్ విలియమ్సన్ (సి), టామ్ బ్లుండెల్, ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, కోలిన్ డి గ్రాండ్‌హోమ్, మాట్ హెన్రీ, కైల్ జామిసన్, టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్, అజాజ్ పటేల్, టిమ్ సౌతీ, రాస్ టేలర్, నీల్ వాగ్నెర్, బిజె వాట్లింగ్, విల్ యంగ్. వీరిలో అందరి ఆట నేను చూడలేదు గానీ...  సీనియర్లు జూనియర్లతో మంచి టీం సెట్ చేసుకున్నాడు. కోలిన్ డి గ్రాండ్‌హోమ్‌ను స్పెషలిస్ట్ ఆల్ రౌండర్‌గా చేర్చగా, అజాజ్ పటేల్ స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఉన్నారు. టామ్ లాథమ్, హెన్రీ నికోల్స్, రాస్ టేలర్ మరియు డెవాన్ కాన్వే వంటి వాళ్ళు మ్యాచ్ ని తిప్పేస్తారు నాకు తెలుసు.


నేను వాళ్ళని పొగిడా అంటావా...? ఆస్ట్రేలియా అయితే నేను మనాళ్ళనే పొగిడే వాడిని... లేకపోతే వాళ్ళ బలహీనతలు చెప్పే వాడిని. కాని ఇది న్యూజిలాండ్... ఒక ద్రావిడ్, ఒక గ్రేం స్మిత్, ఒక గంగూలీ ఇలా అందరూ అతనిలోనే కనపడతారు... అలాంటి కెప్టెన్ విలియమ్సన్. ఎవరు గెలుస్తారో నేను చెప్పలేను... ఆస్ట్రేలియా సీరీస్ చూసాక... మనాళ్ళు గెలవగలరు డ్రా కూడా చేయగలరు... కాని ఇక్కడ కావాల్సింది గెలుపు ఓటమి కాదు... క్రికెట్ కావాలి. స్లెడ్జ్ చేయకూడదు... వాళ్లకు స్వింగ్ ఆడటం చాలా ఈజీ... ఆ స్వింగ్ ని మనం ఎదుర్కోవాలి...


కోహ్లీ.. లాస్ట్ లో ఒక మాట ఫాన్స్ నుంచి... ఫీల్డింగ్ లో బూమ్రాకు బద్ధకం అనుకుంటారు కొందరు.... పంత్ ని మెంటల్ గా సెట్ చేయమని చెప్తున్నారు. ముందు కీపింగ్ లో జాగ్రత్త అని అంటున్నారు. కర్మ గాలి విలియమ్సన్ దో టేలర్ ధో వదిలేసాడు అనుకో...  నీ కొంప మునిగినట్టే... బూమ్రా బౌలింగ్ లో వ్యత్యాసాన్ని ఇప్పటికే వీడియో లు వేసి చూపించి ఉంటాడు, పంత్ వీక్ నెస్ తెలుసుకుని ఉంటాడు, అశ్విన్ క్యారం బాల్ ఎలా ఆడాలో చెప్పేసి ఉంటాడు, రోహిత్ పుల్ షాట్ లు ఆడతాడు అలా బాల్స్ వేయొద్దని అని ఉంటాడు అని సోషల్ మీడియా కోడై కూస్తుంది. 

ఇషాంత్ బౌన్సర్లు వేస్తాడుజాగ్రత్త అంటాడు... ఉమేష్ బౌలింగ్ లో స్పీడ్ ఉంటది గాని లయ ఉండదు అని చెప్తాడు. కాబట్టి జాగ్రత్త... విహారీకి చెప్పు... డిఫెన్స్ జాగ్రత్తగా ఆడుకోమని. పుజారా నీ పుణ్యం ఉంటది సామీ... స్ట్రైక్ రేట్ పెంచు... నీకు వచ్చిన అరుదైన అవకాశం. ఇంగ్లాండ్ సీరీస్ ఉంది ఆగస్ట్ లో అప్పుడు జిడ్డు ఆడుకో బాబూ... విహారీ నీకు తెలుగు వచ్చుగా చదవండి కుదిరితే. కోహ్లీ మాస్టారూ... మీరు కెప్టెన్ గారు కాబట్టి మా సోషల్ మీడియాలో ఉండే ఫాన్స్ అందరి కోరిక ఇదే. గెలవమని అడగట్లేదు... మేము క్రికెట్ ని చూద్దాం అనుకుంటున్నాం అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: