దమ్ముంటే జగన్.. రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి.. ఇదీ ఇటీవల టీడీపీ నాయకులు చేస్తున్న సవాల్.. అమరావతి రైతుల పాదయాత్ర తర్వాత మళ్లీ టీడీపీ యాక్టివ్ అయ్యింది. జగన్ సర్కారు కూడా మూడు రాజధానుల విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈ సమయంలో వైసీపీ నేతలు.. టీడీపీకి ఓ వెరైటీ సవాల్ విసురుతున్నారు. టీడీపీకి దమ్ముంటే వాళ్లంతా రాజీనామా చేయాలని.. చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసురుతున్నారు.


తాజాగా వైసీపీ మంత్రి మేరుగు నాగార్జున ఈ స‌వాలు విసిరారు. గ‌తంలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ధైర్యంగా రాజీనామా చేసి ఉప ఎన్నిక‌కు వెళ్లార‌ని మంత్రి మంత్రి మేరుగు నాగార్జున గుర్తు చేస్తున్నారు. అలాంటి దమ్ము టీడీపీకి ఉందా అని చాలెంజ్ చేశారు. రాజధానికి సంబంధించి టీడీపీ పాదయత్రలు చేయిస్తోందని.. ఆ పాదయాత్రలో రాజధాని ప్రాంత రైతులు, దళితులు ఎంత మంది ఉన్నారని మంత్రి మేరుగు నాగార్జున ప్రశ్నించారు. రాజధాని ఉద్యమంలో ఉన్నవారంతా బయటి నుంచి వచ్చినవారేనని మంత్రి మేరుగు నాగార్జున అంటున్నారు.


ఇదే సమయంలో  మంత్రి మేరుగు నాగార్జున మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు పై విరుచుకుపడ్డారు. నక్కా ఆనందబాబు స్థాయి ఏంటని ప్రశ్నించిన మంత్రి మేరుగు నాగార్జున..   వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక అర్హత మీకుందా అని మండిప‌డ్డారు.  ముఖ్యమంత్రి పై టీడీపీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారన్న మంత్రి మేరుగు నాగార్జున .. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలుసు నా దగ్గర డబ్బులు లేకే భూములు కొనలేకపోయానని న‌క్కా ఆనంద్‌బాబు చెప్పారు కదా అంటూ పాత విషయాలు గుర్తు చేసుకున్నారు.


రాజధాని విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని చెబుతున్నామన్న మంత్రి మేరుగు నాగార్జున... చంద్రబాబు ఆలోచన దళిత వ్యతిరేక ఆలోచన అంటూ మండిపడ్డారు. అసలు దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు దగ్గర ఇంకా ఎందుకున్నారని మంత్రి మేరుగు నాగార్జున ప్రశ్నించతారు. దళితుల్లో పుట్టిన వారెవరూ చంద్రబాబు దగ్గర ఉండరన్న మంత్రి మేరుగు నాగార్జున .. చంద్రబాబు దళిత ద్రోహి అని దళితులను వాడుకుని వంచించిన వ్యక్తి అని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: