అమెరికాకు షార్ట్ టర్మ్ మెమోరీ లాస్ ఏమైనా ఉందేమో చూసుకోండని రష్యా ఘాటు విమర్శలు చేసింది. రష్యా పక్కన ఉండే బెలారస్ దేశంలో అణ్వస్త్ర ఆయుధాలను పెట్టబోతున్నామంటూ రష్యా ప్రకటించింది. దీనిపై అమెరికా తీవ్ర అభ్యంతరం తెలిపింది. అణ్వస్త్ర దేశం కానీ మరో దేశంలో అణు ఆయుధాలను ఎలా పెడతారంటూ మండి పడింది.


ఇది ప్రపంచ అణ్వస్త్ర ఆయుధ నిరోధక చట్టానికి వ్యతిరేకం అని చెబుతోంది. ఇలాంటి చర్యల వల్ల రాబోయే కాలంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తోందని చెప్పింది. దీనికి రష్యా అడ్మినిస్ట్రేషన్ విభాగం కూడా ధీటుగానే సమాధానం ఇచ్చింది. గతంలో అమెరికా ఎన్ని దేశాల్లో అణ్వస్త్ర ఆయుధాలను దాచి ఉంచిందో చరిత్ర తెలుసుకోవాలని జో బైడెన్ అధికార యంత్రాగానికి సూచించింది. అమెరికాలో ఉన్న వారికి ఎమైనా మెమోరీ లాస్ అయిందోనని డౌట్ వస్తోందని ఎద్దేవా చేసింది.


అమెరికా అణు ఆయుధాలను వేరే దేశంలో ఉపయోగించవచ్చు. వాటికి సంబంధించిన సామగ్రిని దాచి పెట్టవచ్చు. కానీ ఇతరులు మాత్రం చేయకూడదు. కచ్చితంగా బెలారస్ లో అణ్వస్త్ర ఆయుధాలను పెట్టబోతున్నాం అని కరాఖండిగా రష్యా చెప్పేసింది. అసలు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇంత కాలం కొనసాగడానికి కారణం అమెరికా ఉక్రెయిన్ వెనక నుండి నడిపించడమే. చివరకు ఉక్రెయిన్ పై అణు యుద్ధ దాడి తప్ప మిగతా అంత విధ్వంసం జరిగిపోయింది.


కావాలనే అమెరికా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల రష్యా అధ్యక్షుడు పుతిన్ తీసుకునే నిర్ణయం ఎంత భయానకంగా ఉంటుందోనని ప్రపంచ దేశాలు బెంబెలెత్తిపోతున్నాయి. ఇలా రష్యా, అమెరికా రెండు దేశాల మధ్య ఆధిపత్య పోరు ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అమెరికా అగ్రరాజ్య వైఖరి మానుకుని, రష్యాను ఎవరైనా కంట్రోల్ చేస్తేనే యుద్ధం ఆగి ప్రపంచ శాంతి చేకూరుతుంది. లేకపోతే అణ్వస్త్ర భయం అలానే కొనసాగుతుందనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: