రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత  మిత్రులు ఎవరూ ఉండరు. ఎందుకంటే 2014లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్లాయి. 2019కి వచ్చే సరికి టీడీపీతో జనసేన విభేదించింది. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చింది. ఎవరికి వారు విడివిడిగా పోటీ చేశారు. వైసీపీకి లాభం చేకూరింది. 2020లో బీజేపీతో  పొత్తుకు జనసేన సిద్ధమైంది.  ఇప్పటివరకు వీరి పొత్తు కొనసాగింది. పక్కా ప్రణాళికతో వెళ్లకపోతే 2019నాటి పరిస్థితిలే ఎదురవుతాయి అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.


అందరూ అనుకున్న విధంగానే టీడీపీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయి. బీజేపీ అగ్ర నాయకత్వంలో తెలుగు వారి సంఖ్య పెరిగింది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రారంభంలో టీడీపీ, జనసేన పొత్తును ఖండించారు. ఆ తర్వాత ఈ అంశం అధిష్ఠానం చూసుకుంటుందని పేర్కొన్నారు. కానీ విష్ణుకుమార్ రాజు, ఇతర బీజేపీ నేతలు చంద్రబాబు అరెస్టు అన్యాయం, అక్రమం అని ఆరోపించారు.


అంతేకాకుండా టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన నేతలు కూడా సోషల్ మీడియాలో కావొచ్చు, ఎల్లో మీడియాలో కావొచ్చు బాబు అరెస్టు అప్రజాస్వామికం అని దుమ్మెత్తి పోస్తున్నాయి. తద్వారా మోదీ కి హెచ్చరికను పంపినట్లే. ఎందుకంటే టీడీపీతో  పొత్తుకు ఏపీ బీజేపీ నేతలు సమ్మతమే అనే సంకేతాన్ని బీజేపీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లయింది. ఈ విషయంలో బీజేపీ అధినాయకత్వం దృష్టి సారించినట్లే అనిపిస్తోంది. టీడీపీ, వైసీపీ పై ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు దూకుడుగా వ్యవహరిస్తూ ఆ రెండు పార్టీలకు సమదూరం పాటించారు.


ఈ క్రమంలో బీజేపీ అధ్యక్షుడిని మార్చి అధినాయకత్వం ఆయనకు షాక్ ఇచ్చింది. ఒకవేళ టీడీపీతో పొత్తుకు మేం వ్యతిరేకం అని బీజేపీ ప్రకటిస్తే సుమారు 10 మంది సీనియర్ నేతలు పార్టీకి రాజీనామా చేసే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: