
కేవలం రాజకీయాలు మాత్రమే సోనియా గాంధీ మాట్లాడుతున్నారని అంటున్నారు. అయితే కాంగ్రెస్ హయాంలో బీజేపీ మద్దతిచ్చిన కూడా కాంగ్రెస్ మిత్ర పక్షాలైన లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేజీ, ఎస్పీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ లు మహిళ బిల్లును అడ్డుకున్న విషయాన్ని మరిచిపోయారు. కాంగ్రెస్ 50 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్నా కూడా ప్రవేశపెట్టని బిల్లును బీజేపీ ప్రవేశపెడితే మాత్రం దానిపై అనేక రకాలుగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు విమర్శలు చేస్తున్నారు.
అయితే మహిళా బిల్లును తక్షణమే అమల్లోకి తీసుకురావాలని రాహుల్ గాంధీ కోరారు. అయితే దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారం వచ్చే నాలుగేళ్లలో నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. పునర్విభజన జరిగిన తర్వాత మహిళా బిల్లు అమల్లోకి వస్తుందని తెలిపారు.
ఒక వేళ ముందే ప్రవేశపెడితే హైదరాబాద్ లో ఓవైసీ స్థానం, కేరళ వయనాడ్ లో రాహుల్ స్థానం మహిళలకు వస్తే మళ్లీ బీజేపీ ప్రభుత్వం కావాలనే కుట్ర పన్ని చేసిందని అంటారు. కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మహిళా బిల్లు అమల్లోకి వస్తుందని ప్రస్తుతం ఈ బిల్లును రాష్ట్రాల్లోని అసెంబ్లీలు కూడా ఆమోదించాల్సిన అవసరం ఉంది తర్వాత చివరిగా రాష్ట్రపతి ఆమోదం తెలుపుతారు. మొత్తానికి మహిళల దశాబ్దాల కల మోడీ నెరేవర్చారని చెప్పాలి.