ఏపీలో వాలంటీర్ వ్యవస్థ ప్రజలతో మమేకం అయింది. ఇది కాదన్నా.. అవునన్నా నిజం. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం జగన్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా దీనిని ప్రవేశ పెట్టారు. అంతే కాదు దీనిని ఆయన తన మానస పుత్రికగా అభివర్ణించారు.  ఇప్పుడు ఎన్నికల వేళ ఈ వ్యవస్థపై వివాదాలు చెలరేగుతున్నాయి. గ్రామ, వార్డుల్లో ప్రతి 50 కుటుంబాలకు ఒకరు చొప్పున పెద్ద నెట్ వర్క్ ను వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.


ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటిని నేరుగా ఇళ్లకే చేర్చేలా వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించింది. అవ్వాతాతలకు, ఇతర పింఛన్ లబ్ధిదారులకు ఒకటో తారీఖున అందించింది. ఎన్నికల వేళ కేసులు పెట్టించి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వాలంటీర్ల వ్యవస్థను దూరం పెట్టించింది. అయితే ఇందులో పవన్, చంద్రబాబు ప్రమేయం లేదనేది ఆయా పార్టీల నాయకుల వాదన. కానీ దీనిని ఎవరూ నమ్మడం లేదు.


ఏది ఎలా ఉన్నా.. మంచి చేస్తే ప్రజలు ఆదరిస్తారు అని చెప్పడానికి వాలంటీర్ వ్యవస్థ నిదర్శనం. వాస్తవానికి వాలంటీర్లు చేసిన పనేంటంటే ప్రభుత్వ సంక్షేమాన్ని లబ్ధిదారుల గడప తొక్కించడం. దీనిని ఆపేసిన తర్వాత ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత చూసి అటు చంద్రబాబు, ఇటు పవన్ కల్యాణ్ లు భయపడ్డారు. ఆదిలో ఈ వ్యవస్థ తప్పు.. మగవాళ్లు లేనప్పుడు డోర్లు కొడతారు అంటూ వివాదస్పద వ్యాఖ్యలతో పాటు డేటా చౌర్యం  అంటూ వాలంటీర్లపై తీవ్ర ఆరోపణలు చేశారు.


ఇప్పుడు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి చంద్రబాబుతో సహా.. పవన్ లు వెనక్కి తగ్గారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇంతే కాదు వీరు నెల నెల రూ.50వేలు సంపాదించుకునేలా చేస్తామన్నారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి నెలకు రూ.10వేలు ఇస్తామని చెబుతున్నారు. అయితే గతంతో చంద్రబాబు కూడా జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేశారు. కానీ ప్రజల్లో వీరిపై వ్యతిరేకత ఏర్పడింది. జన్మభూమి కమిటీలు చేయలేని పనిని వాలంటీర్లు చేసి పెట్టారు. అందుకే చంద్రబాబు వారిని వద్దని వాలంటీర్లను నమ్ముకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: