
జెట్ స్పీడ్ తో అభివృద్ధి వికేంద్రీకరణ..
ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఇక మనకు తిరుగులేదు, అమరావతి అన్స్టాపబుల్. అభివృద్ధి వికేంద్రీకరణ జెట్ స్పీడ్ తో జరగబోతుంది. అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, భోగాపురం ఎయిర్పోర్ట్, ప్రకాశం జిల్లా లో సిబిజి ప్లాంట్స్ ...ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి అన్ని రకాలుగా ప్రధాని నరేంద్ర మోదీ సహకారం అందిస్తున్నారు. మనం గతాన్ని ఒకసారి గుర్తుచేసుకోవాలి. 2014లో కట్టుబట్టలతో మనల్ని బయటకు గెంటేసారు. ఎక్కడి నుండి పరిపాలన ప్రారంభించాలో తెలియని పరిస్థితి. చంద్రబాబు గారికి సంక్షోభాలు కొత్త కాదు. ఒక పక్క సంక్షేమం - మరో పక్క అభివృద్ధి చేసి చూపించారు. అందరూ ఆమోదం తెలిపిన తరువాతే అమరావతిని రాజధానిగా ప్రకటించారు. రైతుల త్యాగంతో అమరావతి ఏర్పడింది. ఒకే రాజధాని - అభివృద్ధి వికేంద్రీకరణ ఎజెండాతో పనిచేసాం. రాయలసీమను ఎలక్ట్రానిక్స్, ఆటోమైబైల్ హబ్ గా తయారు చేసాం, గోదావరి జిల్లాల్లో ఆక్వా ను ప్రోత్సహించాం, ఉత్తరాంధ్రలో ఫార్మా, ఐటీ కంపెనీలను తీసుకొచ్చాం.
ఇప్పుడు ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీకి ఆంధ్రప్రదేశ్ అన్నా, అమరావతి అన్నా ఎంతో ప్రేమ. ఇప్పుడు ఆయన ఢిల్లీ లో ఎంత బిజీగా ఉన్నారో మన అందరికీ తెలుసు. అయినా ఈ కార్యక్రమానికి వచ్చారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఎన్డీయేకి 94 శాతం సీట్లు ఇచ్చారు . మన ప్రధాని నరేంద్ర మోదీజీ ఆంధ్రప్రదేశ్ కోరిన ప్రతి కోరికను తీరుస్తున్నారు. గతంలో విశాఖపట్నం వచ్చి రైల్వే జోన్, ఎన్టీపీసి గ్రీన్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కు శంకుస్థాపన చేసారు. విశాఖ ఉక్కును కాపాడారు. ఇప్పుడు అమరావతి అభివృద్ధికి నిధులు కేటాయించడమే కాకుండా పనులు తిరిగి ప్రారంభిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. రెండూ పవర్ ఫుల్ ఇంజిన్లు. ఒక పక్క పవర్ ఫుల్ ఇంజిన్ నమో, మరో పక్క మన చంద్రబాబు గారు. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు మన చంద్రబాబు, పవనన్న. ఇక మనకు తిరుగు లేదు.
20లక్షల ఉద్యోగాల కల్పనదిశగా అడుగులు
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే 8 లక్షల కోట్ల పెట్టుబడులు వాటి ద్వారా 5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాం. 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. 1,85,000 కోట్లు పెట్టుబడి, 57 వేల మందికి ఉద్యోగాలు కల్పించే ఎన్టిపిసి గ్రీన్ ఎనర్జీ విశాఖపట్నం రాబోతుంది. 1,36,000 కోట్లు పెట్టుబడి, 55 వేల మందికి ఉద్యోగాలు కల్పించే ఆర్సెల్లార్ మిట్టల్ అనకాపల్లి కి రాబోతుంది. 97,000 కోట్లు పెట్టుబడి, 3 వేల మందికి ఉద్యోగాలు కల్పించే బిపిసిఎల్ రామాయపట్నం కి రాబోతుంది. తిరుపతి జిల్లా కు ఎల్జీ ఎలక్ట్రానిక్స్, కర్నూలు, కడప, అనంతపురం కు రెన్యూవబుల్ ఎనర్జీ, ప్రకాశం కు రిలయన్స్ సిబిజి. ఉత్తరాంధ్ర కు ఫార్మా, ఐటి ఇలా అన్ని జిల్లాలను అభివృద్ధి చేయబోతున్నాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు