
తెలంగాణా ప్రభుత్వం నిరుద్యోగులకి గుడ్ న్యూస్ తెలిపింది...వరంగల్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.3
మొత్తం పోస్టులు : 497
అర్హత: డిప్లొమా ఇన్
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్
ఇంజనీరింగ్/సంబంధిత డిప్లొమాతోపాటు ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 18-44 ఏళ్ల మధ్య ఉండాలి.
(ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, పీహెచ్సీలకు పదేళ్లు
మినహాయింపు ఉంటుంది)
ఎంపిక: రాతపరీక్ష ద్వారా.
పరీక్ష విధానం: పరీక్ష మొత్తం 100 మార్కులకు 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు
ఇస్తారు. కాలవ్యవధి 2 గంటలు. కోర్ టెక్నికల్
సబ్జెక్టు నుంచి 80 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 20 ప్రశ్నలు వస్తాయి.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్ జీహెచ్ఎంసీ, వరంగల్ జీడబ్ల్యూఎంసీ
పరిధిలోని కేంద్రాల్లో ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: అప్లికేషన్
ప్రాసెసింగ్ ఫీజు రూ.100, ఎగ్జామ్ ఫీజు రూ.120 చెల్లించాలి. (ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించనవసరం లేదు).
ఫీజు చెల్లింపు ప్రారంభ
తేదీ: జూన్ 04, 2018.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ
తేదీ: జూన్ 05,
2018.
ఫీజు చెల్లింపు, దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 18, 2018.
పరీక్ష తేదీ: జూలై 08, 2018
మరిన్ని వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు
వెబ్సైట్: http://tsnpdcl.cgg.gov.in