ఇక కరోనా దారుణంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వెయ్యటం జరిగింది. ఇక విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తెలంగాణాలో ఇంటర్ పరీక్షలు జరుపనున్నట్లు సమాచారం.ఈ పరీక్షలు జూన్‌ నెలాఖరులో జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా టెన్త్ ఎగ్జామ్స్‌ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను కూడా పరీక్షలు లేకుండానే పైతరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇక సెకండ్ ఇయర్ పరీక్షలను మాత్రం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.జూన్ మొదటి వారంలో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించి పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని సర్కార్ ప్రకటించింది. అయితే పరీక్షలు ఉంటాయా..? ఉండవా? అన్న అంశంపై అనేక వార్తలు వస్తుండడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.


ఈ నేపథ్యంలో కరోనా కేసుల నమోదు తగ్గితే వచ్చే జూన్ చివరల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను నిర్వహించాలని సర్కార్ భావిస్తున్నట్లు సమాచారం. అవకాశం లేని పక్షంలో ఇతర ప్రత్యామ్నాయ ప్రణాళికలను సైతం ప్రభుత్వం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక అలాగే CBSE ఇంటర్ ఎగ్జామ్స్ జులై 15 నుంచి ఆగష్టు 26 వరకు రెండో దశల్లో పరీక్షలు పెట్టనున్నారని సమాచారం.90 నిముషాలే పరీక్షలు నిర్వహించాలని బోర్డు భావిస్తోందట.మల్టీఫుల్ ఛాయిస్, షార్ట్ క్వశ్చన్స్ విధానంలో పరీక్షలు జరుపబోతున్నారట.


ఒక వేళ ఇంటర్ ఎగ్జామ్స్ పెట్టలేని పరిస్థితి ఏర్పడితే ఫస్ట్ ఇయర్ లో విద్యార్థులు సాధించిన మార్కులను పరిగణలోకి తీసుకుని వాటి ఆధారంగానే సెకండియర్ ఫలితాలను సైతం విడుదల చేయాలని యోచిస్తున్నట్లు వినికిడి. అయితే జూన్ 1 వ తేదీన ఈ అంశంపై రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులు, పరీక్షల నిర్వహణపై అన్ని అంశాలపై చర్చించిన అనంతరం ఇంటర్ పరీక్షలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే విషయాన్ని ఏప్రిల్‌ నెలలోనే ప్రభుత్వం ప్రకటించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: