ఇండియా పోస్ట్ తన అధికారిక వెబ్‌సైట్ అయిన www.indiapostgdsonline.gov.in లో గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల కోసం ఆన్‌లైన్ అప్లికేషన్స్ స్వీకరిస్తోంది.బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ ఇంకా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ కి సంబంధించి 12,828 ఖాళీలను భర్తీ చేసే పనిలో ఉంది పోస్టల్ డిపార్టమెంట్.ఈ పోస్టులకు అప్లై చేసుకోవడం కోసం ఆన్‌లైన్ లింక్ 22 మే 2023 నుంచి యాక్టివేట్ లో ఉంది. ఇది 11 జూన్ 2023 దాకా కొనసాగుతుంది. ఈ పోస్టులకు పదో తరగతి అర్హత. ఈ జాబ్స్ కోసం మ్యాథమాటిక్స్, ఇంగ్లిష్‍తో పాటు స్థానిక భాష సబ్జెక్టులను పదో తరగతిలో చదివి ఉండాలి. అంటే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి దాకా చదవడం తప్పనిసరి. అలాగే కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌ తొక్కటం కూడా ఖచ్చితంగా వచ్చి ఉండాలి.దరఖాస్తులు ప్రారంభ తేదీ విషయానికి వస్తే మే 22, 2023 నుంచి స్టార్ట్ అవుతుంది.అలాగే ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదీ విషయానికి వస్తే జూన్‌ 11, 2023 దాకా గడువు ఉంది.దరఖాస్తు సవరణలకు  జూన్‌ 12 నుంచి 14 వరకు అవకాశం ఉంటుంది. జీత భత్యాల విషయానికి వస్తే నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 - రూ.29,380 ఇంకా ఏబీపీఎం పోస్టులకు రూ.10,000 - రూ.24,470 వేతనం ఉంటుంది.


ఇక ఎంపిక విధానం విషయానికి వస్తే అభ్యర్థులని పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం  ఎంపిక చేస్తారు.GDS వయో పరిమితి విషయానికి వస్తే..కనీస వయస్సు 18 సంవత్సరాలు ఉండాలి.ఇక గరిష్ట వయస్సు 40 సంవత్సరాలు ఉండాలి.ఇండియా పోస్ట్ GDS దరఖాస్తు రుసుము రూ. 100/- ఉంటుంది.అప్లై చేసే విధానం..ముందుగా అధికారిక వెబ్‌సైట్, indiapostgdsonline.gov.inని సందర్శించండి.ఆ రిజిస్ట్రేషన్ విభాగంపై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన వివరాలను మీరు అందించండి.అలాగే ఎడమ వైపు బార్‌లో "ఆన్‌లైన్‌లో వర్తించు"పై క్లిక్ చేయండి. ఆ తరువాత పూర్తి దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. ఇక మీ ఫోటోగ్రాఫ్ అలాగే సంతకంతో సహా అవసరమైన పత్రాలను స్కాన్ చేసి, సూచనల ప్రకారం వాటిని మీరు అప్‌లోడ్ చేయండి. ఇక పేర్కొన్న విధంగా దరఖాస్తు రుసుమును చెల్లించడంతో పాటు తుది దరఖాస్తు ఫారమ్‌ను కూడా సమర్పించండి. ఇక మీరు ఫారమ్‌ను సమర్పించిన తర్వాత, దాన్ని ప్రింటవుట్ తీసుకోవడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: