ఒకవైపు కరోనా తీవ్రత మరో వైపు బంగారం ధరలు జనాలను ఆలోచనలో పడేస్తున్నాయి. బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. లాక్‌డౌన్‌ సమయంలో భారీగా పెరిగిన బంగారం ధరలు తాజాగా స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గతకొన్ని రోజులగా మళ్లీ ధరలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఒకానొక సమయంలో రూ. 55 వేలకు చేరుకున్న తులం బంగారం ధర ఇప్పుడు మళ్లీ రూ.49 వేలకు దిగువకు చేరుకుంది. ఇక తాజాగా గురువారం బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.. నిన్నటితో పోలిస్తే ఈరోజు బంగారం ధరలు భారీగా పైకి కదిలాయి. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి.


హైదరాబాద్ మార్కెట్ లో గురువారం బంగారం ధర పరుగులు పెట్టింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.770 పెరుగుదలతో రూ.48,930కు ఎగసింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.700 పెరుగుదలతో రూ.44,850కు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర కేజీకి రూ.300 పెరుగుదలతో రూ.73,900కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు.


అంతర్జాతీయ మార్కెట్ లో  ఈరోజు బంగారం ధర పరుగులు పెట్టింది.. బంగారం ధర ఔన్స్‌కు 0.06 శాతం పెరుగుదలతో 1794 డాలర్లకు చేరింది. బంగారం ధర పైకి కదిలితే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.09 శాతం పెరుగుదలతో 26.59 డాలర్లకు ఎగసింది.బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు ఆభరణాల తయారీ మొదలగు వంటి అంశాలు ప్రభావాన్ని చూపిస్తాయి. ఇకపోతే జూన్ నెలకు బంగారం ధరలు పూర్తిగా పడిపోతాయని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: