పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు భారీగా పడిపోయాయి..నిన్న పైకి కదిలిన బంగారం ధర ఈరోజు నేలచూపులు చూసింది. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర దిగిరావడంతో దేశీ మార్కెట్‌లో అదే ట్రెండ్ నడుస్తోందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇకపోతే వెండి ధరలు మాత్రం రెండు రోజులు నుంచి నిలకడ గానే కొనసాగుతున్నాయి..


హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.410 పడిపోయింది. రూ.49,890కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.360 క్షీణించింది. దీంతో రేటు రూ.45,750కు తగ్గింది. ఇక వెండి ధరలు చూస్తే.. ఈరోజు వెండి ధర పదిలంగా ఉంది. కేజీ వెండి ధర రూ.77,300కు వద్ద కొనసాగుతోంది.. అంటే తులం వెండి ధర దాదాపు రూ.773 వద్ద ఉందని చెప్పుకోవచ్చు. వెండి కొనుగోల్లు ఎప్పటి లాగే ఉండటం తో ధరలు అలానే ఉన్నాయి.


మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర దిగొచ్చింది. బంగారం ధర ఔన్స్‌కు 0.16 శాతం పడిపోయింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1876 డాలర్లకు క్షీణించింది. ఇకపోతే అక్కడ కూడా వెండి ధర భారీగా తగ్గింది.. ఔన్స్‌కు 0.46 శాతం తగ్గుదల తో 28.01 వద్ద ఉంది. గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధర తగ్గుదల కారణంగా దేశీ మార్కెట్‌ లోనూ అదే ట్రెండ్ కొనసాగింది. కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి అంశాలు పసిడి ధరల పై ప్రభావాన్ని చూపిస్తున్నాయ ని నిపుణులు చెబుతున్నారు.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి....


మరింత సమాచారం తెలుసుకోండి: