పెదవుల పైన, నాలుక పైన తెల్లని పూత ఏర్పడి పుండులా తయారవుతుంది. ఈ పుండు చాలా నొప్పిగా ఉంటుంది. కారం ఉన్న పదార్థాలు, పుల్లని పదార్థాలు తినేటప్పుడు ఇంకా నొప్పి వస్తుంది ఈ సమస్య నుండి బయటపడాలంటే ఈ చిట్కాలు పాటించి చూద్దాం..

 తేనెలో యాంటీబయాటిక్ గుణాలు అధికంగా ఉంటాయి.ఇవి నోటిపూతను తగ్గించడానికి సహాయపడతాయి.నోటి పూత ఉన్నచోట తేడా తీసుకొని ఆ పూత పై రాయాలి. అర్ధగంట వరకూ ఏ ఆహారం తీసుకోకూడదు.ఇలా రోజుకు మూడు సార్లు చేయడం వల్ల నోటి పూత తగ్గుతుంది.

 కొబ్బరి నూనెను నోటిపూత పై రాయడం వల్ల నోటి పూత నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే కొబ్బరినూనెలో సహజ సిద్ధమైన యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.ఇవి నోటిపూతను తగ్గించడానికి సహాయపడుతాయి.

 యాపిల్ సైడర్ వెనిగర్ ను ఒక టేబుల్ స్పూన్ తీసుకొని, అరకప్పు నీటిలో కలపాలి.ఆ నీటిని నోట్లో పోసుకొని కొంచెం సేపు బాగా పుక్కిలించాలి.ఇలా చేయడం వల్ల నోటి పూత నుంచి ఉపశమనం  కలుగుతుంది.

 నోటి పూతతో బాధపడుతున్నప్పుడు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకొని, అందులోకి ఒక టేబుల్ స్పూను ఉప్పు కలిపి ఆ నీటిని నోట్లో పోసుకొని పుక్కలించడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

 నోటి పూత ఉన్నప్పుడు రోజు ఆరెంజ్ జ్యూస్ రెండు గ్లాసులు తీసుకోవాలి.  ఆరెంజ్ జ్యూస్ లో ఉంటే విటమిన్ సి ఆంటీ ఆక్సిడెంట్ గా పని చేసి నోటిపూతను తగ్గిస్తుంది.

 వెల్లుల్లి నోటిపూతను తగ్గించడానికి మంచి మందులా పనిచేస్తుంది. ఎలా అంటే వెల్లుల్లిలో యాంటీబయటిక్ గుణాలు ఉన్నాయి.వెల్లుల్లిని  ఈ విధంగా వాడాలి.  రెండు వెల్లుల్లి తీసుకొని బాగా నలిపి నోటిపూత పై రాయాలి. ఇలా చేయడం వల్ల నోటి పూత తగ్గుతుంది.                                                                                                                                                                                                    

మరింత సమాచారం తెలుసుకోండి: