ప్రస్తుత కాలంలో ఆహార పదార్థాలలో బాగా కల్తీ జరుగుతోంది అని ఎన్నో మీడియాల ద్వారా మనం వింటూనే ఉన్నాం. అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భాలలో మనం కూడా ఈ కల్తీ ఆహారాన్ని తీసుకొని కూడా ఉండి ఉంటాము. అయితే ఈ కల్తీ ఆహారం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవడంతో పాటు, దీర్ఘకాలిక జబ్బులు కూడా వచ్చే ప్రమాదాలు ఉన్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అయితే ఈ కల్తీ ఉన్న ఆహారాన్ని గుర్తించడం ఎలానో చాలా మందికి తెలియకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు మేము చెప్పే కొన్ని రకాల ఆహార కల్తీ లను ఎలా గుర్తుపట్టాలో మీరూ చూసి, చదివి తెలుసుకోండి.
జీలకర్ర:
జీలకర్రలో మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కల్తీ జరుగుతోంది. దీనిని మనం ఏ విధంగా గుర్తు పట్టాలంటే? జీలకర్రను రెండు చేతుల మధ్య ఉంచి, కలిపినప్పుడు చేతికి రంగు అంటితే,అది కల్తీ జరిగినట్లు అని గుర్తుంచుకోవాలి.
శెనగపిండి:
ప్రస్తుతకాలంలో శెనగపిండి కల్తీ మరీ ఘోరంగా ఉంది. శెనగపిండిలో రంగు రావడానికి మిఠాయి రంగు పొడిని కలిపి కల్తీ చేస్తున్నారు. కొద్దిగా శెనగపిండిలో నీళ్లు పోసి కలిపితే, ఆ నీళ్లు ఎరుపు రంగులోకి మారితే,కల్తీ జరిగినట్లు అని అర్థం చేసుకోవాలి.
చక్కెర:
చక్కెరలో సుద్ధ ముక్కల పొడి, బొంబాయిరవ్వ వంటివి కలిపి కల్తీ చేస్తుంటారు. పంచదార నీళ్ళలో వేస్తే కరుగుతుంది. అడుగున రవ్వ కనిపించినా,నీరు తెల్లగా మారిన కల్తీ జరిగినట్లు.
బెల్లం:
బెల్లంలో మెటానిల్ పసుపు రంగు కలిపి కల్తీ చేస్తుంటారు. ఆ బెల్లాన్ని నీళ్లలో వేసి కరిగిస్తే,మంచి నీటిలో కరిగిపోతుంది. అడుగున కల్తీ బెల్లం తెట్టులా తేలుతుంది.
వనస్పతి:
వనస్పతిలో సాధారణంగా గంజి పొడి,ఉడికిన బంగాళాదుంపను కలిపి కల్తీ చేస్తుంటారు. వనస్పతి లో కొద్దిగా అయోడిన్ కలిపితే నీలి రంగులోకి మారితే, కల్తీ జరిగినట్లు, ఏ మార్పు లేనట్లయితే స్వచ్ఛంగా ఉన్నట్లు అర్థం.
వెన్న లేదా నెయ్యి:
వెన్న లేదా నెయ్యిలో కొద్దిగ హైడ్రోక్లోరిక్ ఆమ్లం, పంచదార మిశ్రమాన్ని కలిపి ఐదు నిమిషాల తర్వాత అది ఎరుపు రంగులోకి మారితే కల్తీ జరిగిందని అర్థం.
కందిపప్పు:
కందిపప్పులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిపితే,అది ఎరుపు రంగులోకి మారుతుంది. అప్పుడు అది కల్తీ జరిగినట్లు తెలుసుకోవాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి